డెంగీ జ్వరంతో పెళ్లి కూతురు మృతి  చెందిన సంఘటన చిత్తూరు జిల్లాలో చోటుచేసుకుంది. మరి కొద్ది రోజుల్లో పెళ్లి అనగా... యువతి డెంగీ జ్వరం బారినపడింది. కోలుకుంటుందిలే అని అంతా ఆశపడ్డారు. కోలుకున్నాక.... మళ్లీ పెళ్లి పీటలు ఎక్కుతుందని అనుకున్నారంతా... కానీ... ఆమె ఏకంగా పాడె ఎక్కాల్సి వస్తుందని ఎవరూ ఊహించలేకపోయారు.

పూర్తి వివరాల్లోకి వెళితే... చిత్తూరు జిల్లా పాలసముద్రం మండలం టీవీఎన్ఆర్ పురానికి చెందిన యువతికి ఇటీవల పెళ్లి కుదిరింది. నిశ్చితార్థం కూడా చేసేశారు. మరి కొద్ది రోజుల్లో పెళ్లి అనగా.. యువతికి జ్వరం వచ్చింది. హాస్పిటల్ కి తీసుకొని వెళితే.. డెంగీ అని వైద్యులు తేల్చిచెప్పారు. నాలుగు రోజుల్లో తగ్గిపోతుంది కదా అని పెళ్లి కూడా వాయిదా వేశారు.

యువతి కోలుకున్నాక పెళ్లి చేద్దామని అందరూ భావించారు. అయితే... అనూహ్యంగా... ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతూనే చికిత్స పొందుతోంది. స్థానికంగా ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా పరిస్థితి విషమించింది.దీంతో వేలూరులోని ఆస్పత్రిలో చేర్పించారు. అయినా ఫలితం దక్కలేదు. పెళ్లి పీటలు ఎక్కాల్సిన కూతురు తమ కళ్ల ముందే చనిపోవడం చూసి ఆమె తల్లిదండ్రులు తట్టుకోలేకపోతున్నారు. కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

AlsoRead మంచిర్యాలలో విషాదం: ఒకే కుటుంబంలో నలుగురిని బలితీసుకున్న డెంగీ

కాగా... ఈ మధ్యకాలంలో డెంగీతో చనిపోతున్నవారి సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతోంది. ఇటీవల డెంగీ కారణంగా ఓ కుటుంబం మొత్తం ప్రాణాలు కోల్పోయింది.  ఇంకో కుటుంబంలో డెంగీతో భార్య చనిపోయింది. భార్య చనిపోవడాన్ని తట్టుకోలేక ఆమె భర్త కూతురికి విషమిచ్చి అతను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. కేవలం ఆంధ్రాలోనే కాకుండా తెలంగాణలోనూ ఇదే పరిస్థితి వ్యక్తమౌతోంది. 

AlsoRead డెంగీతో భార్య మృతి... తట్టుకోలేక భర్త ఆత్మహత్య..