Asianet News TeluguAsianet News Telugu

విజయవాడ పార్లమెంట్ స్ధానంలో బ్రాహ్మణి పోటీ ?

ఈ పరిస్ధితుల్లోనే బ్రాహ్మణి కూడా విజయవాడ, గుంటూరులపై ప్రదానంగా దృష్టి కేంద్రీకరించినట్లు సమాచారం. అందులో కూడా విజయవాడలో పోటీ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయట. రాష్ట్రం మొత్తం మీద బ్రాహ్మణికి  పై రెండు నియోజకవర్గాలకన్నా సురక్షితమైన స్ధానాలు లేవనే టిడిపి వర్గాలంటున్నాయ్.

Brahmani eyes on Vijayawada loksabha seat

అధికార పార్టీలో జరుగుతున్న ప్రచారం నిజమే అయితే వచ్చే ఎన్నికల్లో నారా బ్రాహ్మణి పార్లమెంట్ కు పోటీ చేస్తారు. సేఫ్ సీటు ఎంపిక కూడా అయిపోయిందనే అంటున్నారు. మొన్నటి వరకూ రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన లేదని చెప్పినా వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనే పార్టీ వర్గాలంటున్నాయి. బ్రాహ్మణి ఇష్టం లేకపోయినా పరిస్ధితులు ఆ విధంగా తోసుకువస్తున్నాయని నేతలంటున్నారు. అందుకే సేఫ్ సీటు కోసం వెతికారట. అందులో భాగంగానే విజయవాడ కానీ లేక గుంటూరు పార్లమెంట్ స్ధానాలపై బ్రాహ్మణి ఆశక్తి చూపుతున్నట్లు సమాచారం.

ప్రస్తుతం ప్రభుత్వం మీద ప్రజల్లో వ్యతిరేకత మొదలైందన్నది వాస్తవం. వచ్చే ఎన్నికల్లో మళ్ళీ అధికారంలోకి వచ్చేదీ లేనిదీ ఇప్పుడే స్పష్టంగా చెప్పలేకున్నా వ్యతిరేకత ఉందన్నది మాత్రం స్పష్టం. మొన్న జరిగిన ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎంఎల్సీ ఎన్నికల్లో పోటీ చేసిన నాలుగు స్ధానాల్లోనూ టిడిపి ఓడిపోవటమే నిదర్శనం. అందుకనే వచ్చే ఎన్నికలకు ఓ మంచి స్టార్ క్యాపైనర్ ను సిద్ధం చేసుకోవాల్సిన అవసరం చంద్రబాబుకు ఏర్పడింది.

చంద్రబాబు స్టీరియోటైప్ ప్రసంగాలను విని విని జనాలకు విసుగెత్తేసింది. ఇక లోకేష్  కూడా మంచి వక్తేమీ కాదు. బాలకృష్ణ స్పీచ్ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. మరి ఈ పరిస్ధితుల్లో పార్టీ గొంతును సమర్ధవంతంగా వినిపించే వారు ఎవరు? పైగా వచ్చే ఎన్నికల్లో భాజపాతో పొత్తు ఉంటుందో ఉండదో ?ఒకవేళ పొత్తుండకపోతే పార్టీ పరిస్ధితి మరింత అధ్వాన్నమే. అందుకే ఇప్పటి నుండే పార్టీ తరపున స్టార్ క్యాంపైనర్ రూపంలో ఓ ‘తురుపుముక్క’ను సిద్ధం చేసుకోవాలని పార్టీ నాయకత్వం అనుకుంటున్నట్లు సమాచారం. అందుకే హెరిటేజ్ సంస్ధను అడ్డంపెట్టుకుని బ్రాహ్మణితో మీడియా సమావేశాల్లోను, ఇతరత్రా సమావేశాల్లో వేదికలపై మాట్లాడిస్తున్నారు. అంటే అలావాటు చేస్తున్నారన్నమాట.

ఈ పరిస్ధితుల్లోనే బ్రాహ్మణి కూడా విజయవాడ, గుంటూరులపై ప్రదానంగా దృష్టి కేంద్రీకరించినట్లు సమాచారం. అందులో కూడా విజయవాడలో పోటీ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయట. రాష్ట్రం మొత్తం మీద బ్రాహ్మణికి  పై రెండు నియోజకవర్గాలకన్నా సురక్షితమైన స్ధానాలు లేవనే టిడిపి వర్గాలంటున్నాయ్. నియోజకవర్గాల ఎంపిక అయిపోయింది కాబట్టి ఏదో రూపంలో ప్రత్యక్షంగా రంగంలోకి దిగటమే మిగిలిందన్నమాట. దానికీ ఏదో స్కెచ్ వేసే ఉంటారు లేండి చంద్రబాబు. చూద్దాం అదేంటో త్వరలో తేలిపోతుంది కదా?

Follow Us:
Download App:
  • android
  • ios