Asianet News TeluguAsianet News Telugu

శివస్వామి కుట్ర.. నా బిడ్డే పీఠాధిపతి కావాలి: డీజీపీకి బ్రహ్మంగారి మఠాధిపతి రెండో భార్య ఫిర్యాదు

కడప జిల్లా బ్రహ్మంగారి మఠం పీఠాధిపతి వివాదం కొనసాగుతోంది. ఈ సమస్యను పరిష్కరించేందుకు పలువురు పీఠాధిపతులు వస్తున్నారు. అయితే పీఠాధిపతుల బృందం రాకను పీఠాధిపతి రెండో భార్య మహాలక్ష్మీ వ్యతిరేకిస్తున్నారు.

brahmamgari matam temple controversy ksp
Author
Banganapalle, First Published Jun 12, 2021, 2:35 PM IST

కడప జిల్లా బ్రహ్మంగారి మఠం పీఠాధిపతి వివాదం కొనసాగుతోంది. ఈ సమస్యను పరిష్కరించేందుకు పలువురు పీఠాధిపతులు వస్తున్నారు. అయితే పీఠాధిపతుల బృందం రాకను పీఠాధిపతి రెండో భార్య మహాలక్ష్మీ వ్యతిరేకిస్తున్నారు. మొదటి భార్య పెద్ద కొడుకు వెంకటాద్రికే మొగ్గు చూపుతున్నారని ఆమె ఆరోపిస్తున్నారు. మఠం సందర్శనకు ఎలాంటి హక్కులేదని మహాలక్ష్మీ తేల్చిచెబుతున్నారు.

ఇక నుంచి బ్రహ్మంగారి మఠంను శివమఠంగా మారుస్తారంటూ ఆమె మండిపడ్డారు. గొడవలు సృష్టించేందుకే పీఠాధిపతులు వస్తున్నారని మహాలక్ష్మీ ఆరోపిస్తున్నారు. పూర్వ పీఠాధిపతి నిర్ణయం గౌరవిస్తూ.. దేవాదాయ శాఖ ఆమోదంతో మఠంను పాలించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. శైవక్షేత్ర పీఠాధిపతి శివస్వామి, పీఠాధిపతులపై మహాలక్ష్మీ డీజీపీ గౌతం సవాంగ్‌కు ఫిర్యాదు చేశారు. సంప్రదింపుల పేరుతో మభ్యపెడుతున్నానరని ఆమె ఆరోపించారు.

Also Read:బ్రహ్మంగారి మఠం పీఠాధిపతి: వారసుల మధ్య రాజీకి 14 మఠాధిపతుల రాక, అనుమతి లేదన్న పోలీసులు

మొదటి భార్య కుమారుడిని మఠాధిపతిని చేయడానికి శివస్వామి కుట్ర చేస్తున్నారని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. వీలునామా ప్రకారం తన కుమారుడు గోవిందానందే మఠాధిపతి కావాలని మహాలక్ష్మీ కోరుతున్నారు. చర్చల పేరుతో పిలిచి తమను శివస్వామి మోసగించారని ఆరోపిస్తున్నారు. మఠాధిపతి వ్యవహారంలో తెరపైకి కొత్త వాదనలు వస్తుండటంతో వ్యవహారం మరింత చిక్కుముడిగా మారుతోంది. 

Follow Us:
Download App:
  • android
  • ios