రివర్స్: బాలుడిపై ఎదురింటి ఆంటీ లైంగిక దాడి

Boy sexually assaulted by a woman
Highlights

బాలికలపై పురుషులు లైంగిక దాడి పాల్పడడం జరుగుతూ వస్తోంది.

విజయవాడ: బాలికలపై పురుషులు లైంగిక దాడి పాల్పడడం జరుగుతూ వస్తోంది. అటువంటి సంఘటనల గురించే మనం వింటున్నాం, చదువుతున్నాం. కానీ, విజయవాడలో అందుకు పూర్తి విరుద్ధమైన సంఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే...

ఓ మహిళ 14 ఏళ్ల బాలుడిపై విజయవాడలో లైంగిక దాడికి పాల్పడినట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. శుక్రవారం సాయంత్రం బాలుడిని 47 ఏళ్ల వయస్సు గల మహిళ ఇంట్లోకి పిలిచి అతనిపై అత్యాచార యత్నం చేసినట్లు ఆరోపణలు వచ్చాయి.

ఫోక్సా చట్టం కింద మహిళపై కేసు నమోదు చేసి ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. తనపై మహిళ లైంగిక దాడికి పాల్పడిన విషయాన్ని బాలుడు తన తల్లికి చెప్పినట్లు సమాచారం. 

దాంతో బాలుడి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలుడిని వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి పంపించారు. 2012లో అమలులోకి వచ్చిన ఫోక్సా చట్టం కింద మైనర్లపై లైంగిక దాడులకు, వేధింపులకు పాల్పడేవారిపై చర్యలు తీసుకునే వెసులుబాటు ఉంది. 

పాయకాపురం వాంబే కాలనీకి చెందిన  ఆ మహిళ భర్త ఎనిమిదేళ్ల క్రితం మరణించాడు. ఆమెకు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. వాళ్లిద్దరికీ వివాహం చేసి అత్తారింటికి పంపించి వేసింది. అప్పటి నుంచి ఆమె ఒంటిరిగా ఉంటోంది.

 ఆమె ఇంటి ఎదురుగా ఉంటున్న14 ఏళ్ల బాలుడు ఇటీవలే పదో తరగతి పరీక్షలు రాశాడు. ఎదురింటి వారనే చొరవతో ఆ బాలుడు ఆ మహిళ ఇంటికి వెళుతుండేవాడు. ఈ క్రమంలో అతనితో ఆమె అసభ్యకరంగా ప్రవర్తిస్తూ వచ్చింది. 

దానికి తోడు పిలిచినప్పుడల్లా తన వద్దకు రావాలని ఒత్తిడి చేయడంతో ఆ బాలుడు భయపడ్డాడు. అప్పటి నుంచి అక్కడ ఉండడం మానేసి దూరంగా ఉంటున్న బంధువుల ఇంటికి వెళ్లి అక్కడే ఉంటున్నాడు. ఇంటికి రావకపోవడానికి కారణమేమిటని తల్లిదండ్రులు గట్టిగా ప్రశ్నించడంతో అసలు విషయం చెప్పాడు. 

దీంతో బాలుడి తల్లి ఆ మహిళపై చేయి చేసుకుంది. దీంతో ఆ మహిళ నున్న రూరల్‌ పోలీస్‌స్టేషన్‌లో బాలుడి తల్లిపై ఫిర్యాదు చేసింది. అయితే పోలీసులు బాలుడి తల్లిదండ్రులను పిలిపించి విచారించగా, వారు జరిగిన విషయం చెప్పారు. 

loader