పిడుగురాళ్లలో విషాదం: నీటిగుంటలో పడి 15 ఏళ్ల బాలుడు మృతి

గుంటూరు జిల్లా పిడుగురాళ్ళలో శుక్రవారం దారుణం జరిగింది. నీటి గుంటలో పడి 15 సంవత్సరాల బాలుడు మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే.. పిడుగురాళ్ల పట్టణానికి చెందిన మస్తాన్ బైక్ మెకానిక్ షాప్ నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు

boy killed in water pond at Piduguralla ksp

గుంటూరు జిల్లా పిడుగురాళ్ళలో శుక్రవారం దారుణం జరిగింది. నీటి గుంటలో పడి 15 సంవత్సరాల బాలుడు మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే.. పిడుగురాళ్ల పట్టణానికి చెందిన మస్తాన్ బైక్ మెకానిక్ షాప్ నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు.

అతని కుమారుడు ఎస్కే యాసిన్ తండ్రికి చేదోడువాదోడుగా షాపులోనే మెకానిక్ పనులు చేస్తుంటాడు. ఈ క్రమంలో కోవిడ్ కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం లాక్‌డౌన్ విధించిన నేపథ్యంలో మధ్యాహ్నం 12 గంటల వరకే షాపు కార్యకలాపాలు ఉంటున్నాయి.

ఈ తరుణంలో మధ్యాహ్నం 12 గంటల తర్వాత యాసిన్ తన ముగ్గురు స్నేహితులతో కలిసి పట్నంలోని ఆక్స్‌ఫర్డ్ స్కూల్ దగ్గర్లో గల పెద్ద నీటి కుంటలో ఈతకు దిగారు. ఈ నేపథ్యంలో యాసిన్ ఊపిరాడక మునిగిపోయాడు.. మిగిలిన ముగ్గురు పిల్లలు అతనిని రక్షించాలని ప్రయత్నించారు.

అయితే భయాందోళనకు గురై చుట్టుపక్కల వాళ్ళని పిలిచారు. అయితే అప్పటికే ఊపిరాడక యాసిన్ చనిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని గజ ఈతగాళ్లు  సహాయంతో మృతదేహాన్ని వెలికితీశారు. యాసీన్ తండ్రి మస్తాన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios