విజయవాడ: తెలుగుదేశం పార్టీపై వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ నిప్పులు చెరిగారు. వైసీపీ సానుభూతిపరుల ఓట్లను తొలగించేందుకు తెలుగుదేశం పార్టీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. విజయవాడలో ఎన్నికల ప్రధాన అధికారి గోపాల కృష్ణ ద్వివేదిని కలిసిన బొత్స సత్యనారాయణ సర్వేలపై ఫిర్యాదు చేశారు. 

సర్వేల పేరుతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతిపరుల ఓట్లను తొలగిస్తున్నారంటూ ఫిర్యాదు చేశారు. నెల్లిమెర్ల నియోజకవర్గం కుమిలిలో స్వాధీనం చేసుకున్న ట్యాబ్‌లను బొత్స ఎన్నికల ప్రధాన అధికారికి అందజేశారు. 

ప్రభుత్వ అధికారుల పేరుతో టీడీపీ బృందాలు గ్రామాల్లో తిరుగుతున్నాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని స్పష్టం బొత్స సూచించారు. సర్వేలు చేసే వాళ్లు మీరు ఏ పార్టీ అనే విషయాన్ని ఆరా తీయరన్నారు. నెల్లిమర్లలో పట్టుబడ్డ వాళ్లు ప్రభుత్వం తరపున వచ్చామని చెబుతున్నారని చెప్పారు. 

మనుషులను వదిలేయండని ట్యాబ్‌లు తీసుకెళ్లి ఫిర్యాదు చేసుకోండంటూ స్థానిక పోలీసులే తమ నేతలకు ట్యాబ్‌లు అప్పజెప్పారని బొత్స చెప్పారు. ఆ తర్వాత తమ నేతలను అరెస్ట్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ నేతలను ఎందుకు అరెస్ట్ చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. 

ప్రజలకు ఓటు వేసుకునే హక్కు లేకుండా చేద్దామని చంద్రబాబు నాయుడు కుట్ర పన్నుతున్నారని మండిపడ్డారు. ఇప్పటికే అనేక జిల్లాలో టీడీపీ నేతలు ఇలాగే తిరుగుతూ వైసీపీ ఓట్లు తొలగించే ప్రయత్నాలు చేస్తున్నారని ఇలాంటివి జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఎన్నికల ప్రధాన అధికారిని కోరినట్లు బొత్స సత్యనారాయణ తెలిపారు. 

ఈ వార్తలు కూడా చదవండి

చిన్న శీను అరెస్టుపై నిప్పులు చెరిగిన బొత్స

విజయనగరంలో వైసీపీ నేత చిన్న శ్రీను అరెస్ట్