విజయనగరం జిల్లా నెల్లిమర్లలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. కుమిలిలో కొందరు అజ్ఞాత వ్యక్తులు ఓటర్ల లిస్టుతో సర్వే చేస్తున్నట్లు తెలుసుకున్న వైసీపీ నేతలు వారిని అడ్డుకున్నారు. అనంతరం వారిని పోలీసులకు అప్పగించారు. అయితే పట్టుబడ్డ వ్యక్తుల నుంచి వైసీపీ నేత మజ్జి శ్రీను ట్యాబ్‌లను లాక్కొన్నారు.

ట్యాబ్‌లను తన వద్దే ఉంచుకోవడంతో.. దానిని తమకు అప్పగించాలంటూ మజ్జి శ్రీనును కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల తీరుపై వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ వ్యవహారాన్ని ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్తామని ఆయన హెచ్చరించారు. టీడీపీ అనుకూలంగా ఉన్న వారిని ఓటర్ల లిస్టులో ఉంచి లేని వారిని జాబితాలోంచి తొలగించేస్తున్నారంటూ బొత్స ఆరోపించారు. అయితే ఆ ట్యాబ్‌లలో ఏముందనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.