బోస్టన్ కమిటీ ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికలోని వివరాలను ప్రణాళిక విభాగ కార్యదర్శి విజయ్ కుమార్ మీడియాకు వెల్లడించారు. కమిటీ సభ్యులు ఏపీలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించిందని ఆయన తెలిపారు. అభివృద్ధికి ఏ విధానాలు చేపట్టాలో నివేదికలో స్పష్టంగా తెలిపారని.. 13 జిల్లాలను ఆరు ప్రాంతాలుగా సంస్థ పరిశీలించిందన్నారు.

ఏ ఏ ప్రాంతాల్లో ఏ రకమైన వనరులున్నాయో పరిశీలించడం జరిగిందన్నారు. 2.25 లక్షల కోట్ల రుణాలు ఏపీకి ఉన్నాయని.. వ్యవసాయ ఉత్పాదకతలో ప్రాంతాల మధ్య వ్యత్యాసం ఉన్నట్లు గుర్తించిందని విజయ్ తెలిపారు.

బోస్టన్ కన్సల్టెన్సీ నివేదికలోని అంశాలు:

* ఆప్షన్ వన్ సెక్రటేరియేట్ వివిధ శాఖల కార్యాలయాలు, అత్యవసర అసెంబ్లీ సమావేశాలు విశాఖలో పెట్టుకోవచ్చు
* అమరావతిలో అసెంబ్లీ, వివిధ శాఖాధిపతుల కార్యాలయాలు, హైకోర్టు బెంచ్ పెట్టుకోవచ్చు
* కర్నూలులో హైకోర్టు.. ఆప్షన్-2లో విశాఖలో సెక్రటేరియేట్, సీఎం, గవర్నర్ కార్యాలయాలు, వివిధ శాఖల కార్యాలయాలు, అమరావతిలో అసెంబ్లీ హైకోర్టులో అసెంబ్లీ, హైకోర్టు బెంచ్ 

* రాజధాని విభజనకు రెండు ఆప్షన్లు ఇచ్చిన బోస్టన్ రిపోర్ట్
* 2009లో వచ్చిన వరదలో ఇప్పుడు అమరావతిగా చెబుతున్న ప్రాంతం మునిగిపోయింది
* అమరావతిలో ఐదు కిలోమీటర్ల పరిధి వరకూ నిర్మాణాలు చేపట్టకూడదు
* 25 శాతం ప్రజలు సీఎం రిలీఫ్ ఫండ్‌ కోసం అమరావతికి వచ్చారు
* కర్నూలులో హైకోర్టు, స్టేట్ కమిషన్లు, అప్పిలేట్ సంస్థలు

* హైదరాబాద్‌కు ప్రత్యామ్నాయంగా కర్నూలును అభివృద్ధి చేయాలి
* బెంగళూరుకు ప్రత్యామ్నాయంగా అనంతపూర్‌ను అభివృద్ధి చేయాలి
* కృష్ణా, గుంటూరు జిల్లాలను ఎడ్యుకేషన్ హబ్‌గా మార్చాలి
* శాసనసభకు విజయవాడ మొదటి ప్రాధాన్యమైతే, రెండో ప్రాధాన్యత విశాఖపట్నం
* జ్యుడీషియరీకి మొదటి ప్రాధాన్యత కర్నూలు, రెండో ప్రాధాన్యత అమరావతి

* రాష్ట్రానికి మరిన్ని పోర్టులు అవసరం
* మౌలిక సదుపాయాలు, రోడ్డు రవాణా వ్యవస్ధలను మరింత అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది.
* దక్షిణాదిలోనే ఏపీలో తక్కువ తలసరి ఆదాయం ఉంది
* కర్నూలు, కడప జిల్లాలో పారిశ్రామిక అభివృద్ధి చాలా తక్కువగా జరిగింది.

* చైన్నై నుంచి విశాఖ వరకు ఉన్న రైలు మార్గాన్ని ఆధునీకరణ చేయాలి
* అక్షరాస్యతలోనూ జాతీయ సగటు కన్నా ఏపీలో తక్కువ
* రాష్ట్రంలోని ప్రకృతి సంపదను సరిగ్గా వినియోగించుకోలేకపోయారు
* ప్రకృతి సంపదపై కీలక సూచనల
* కృష్ణా, గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాలు తప్ప మిగిలిన ప్రాంతాల్లో సాగు తక్కువ
* పర్యాటకం విషయంలోనూ చాలా తక్కువ అభివృద్ధి. కేరళతో పోలిస్తే ఏపీలో టూరిజం అభివృద్ధి చెందలేదు
* రాష్ట్రంలో ఏడు జిల్లాలు వెనుకబడి ఉన్నాయి
* ఉత్తరాంధ్రను మెడికల్ హబ్‌గా తయారు చేయవచ్చు, కాఫీ, జీడిపంటలు పెంచుకోవచ్చు

* విశాఖ నుంచి చెన్నై వరకు రోడ్డు కనెక్టివిటీ ఉంది
* అమరావతి రాజధానికి రుణం తెస్తే... పదివేల కోట్లు వడ్డీ కట్టాలి.
* అమరావతిలోని భూముల అమ్మకాల ద్వారా వచ్చే నిధులు సరిపోవు
* లక్షా పదివేల కోట్లు ఒకే నగరంపై పెట్టడం అవసరమా.
* పెట్టుబడి-రాబడి కోణంలో చూస్తే అమరావతి నిర్మాణం ఆర్ధిక భారం, అసలు ప్రభుత్వం వద్ద లక్ష కోట్లు ఉన్నాయా
* ఇప్పటికే 2.5 లక్షల కోట్లు అప్పు ఉన్న రాష్ట్రం... అంత పెట్టుబడి పెట్టడం అవసరమా..?
* నీటిపారుదలపై పెట్టుబడులు పెడితే ప్రాంతీయ అసమానతలు తొలగుతాయి.
* అమరావతిపై వచ్చే ఆదాయం అప్పులు తీర్చడానికి సరిపోతుంది.
* అమరావతిపై కంటే ఆ డబ్బును అన్ని ప్రాంతాల్లో అభివృద్ధికి ఉపయోగిస్తే మంచిది
 

Read Also:

మా భూములపై విచారణ చేస్తే.. వైఎస్ భారతిపైనా జరపాలి: ధూళిపాళ్ల నరేంద్ర

జగన్ చేతిలో అమరావతి భవితవ్యం: సర్కార్‌కు బోస్టన్ నివేదిక