అమరావతి: మాజీ ఎమ్మెల్యే బొండా ఉమా మహేశ్వరరావు సోమవారం నాడు చంద్రబాబుతో భేటీ అయ్యారు. శనివారం నాడు ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న బొండా ఉమా మహేశ్వరరావుతో భేటీ అయిన విషయం తెలిసిందే.

బొండా ఉమ వైఎస్ఆర్‌సీపీలో చేరుతారని సోషల్ మీడియాలో ప్రచారం సాగుతోంది.చంద్రబాబుతో భేటీ తర్వాత తన భవిష్యత్తు కార్యాచరణను ప్రకటించనున్నట్టు బొండా ఉమ ప్రకటించారు. బుద్దా వెంకన్న రాయబారం మేరకు బొండా ఉమ చంద్రబాబుతో భేటీ అయ్యారు.

ఎన్నికల తర్వాత 20 రోజుల పాటు కుటుంబసభ్యులతో కలిసి బొండా ఉమ విదేశాల్లో గడిపి వచ్చారు.  శుక్రవారం నాడు ఆయన విజయవాడకు చేరుకొన్నారు. శనివారం నాడు ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న బొండా ఉమతో భేటీ అయ్యారు.

రాజకీయంగా సాహసోపేతమైన నిర్ణయం తీసుకొంటానని బొండా ఉమ సోషల్ మీడియాలో ప్రకటించారు. ట్విట్టర్ వేదికగా బొండా ఉమ ట్వీట్ చేశారు. చంద్రబాబుతో భేటీ తర్వాత బొండా ఉమ  ఎలా స్పందిస్తారనేది ప్రస్తుతం అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.

సంబంధిత వార్తలు

చంద్రబాబుతో భేటీకి బొండా ఉమ సై: పార్టీ మార్పుపై స్పష్టత
బుజ్జగింపులు: చంద్రబాబు దూతగా బొండా ఉమతో బుద్ధా వెంకన్న భేటీ