విజయవాడ: పార్టీ మారుతారంటూ ప్రచారం సాగుతున్న తెలుగుదేశం పార్టీ నేత బోండా ఉమా మహేశ్వర రావుతో పార్టీ నేత బుద్ధా వెంకన్న చర్చలు జరిపారు. బోండా ఉమా పార్టీ మారుతారంటూ ఇటీవల మీడియాలో వరుసగా వార్తాకథనాలు వస్తున్నాయి. 

ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడదు బొండా ఉమాను బుజ్గగించేందుకు పూనుకున్నారు. ఇందులో భాగంగా ఆయనతో చర్చలకు తన రాయబారిగా బుద్ధా వెంకన్నను పంపించారు. 

తాను చంద్రబాబుతోనే ఉంటానని, పార్టీ మారే ప్రసక్తి లేదని బొండా ఉమా బుద్ధా వెంకన్నకు హామీ ఇచ్చారు. దాంతో బోండా ఉమాకు బుద్ధా వెంకన్న ధన్యవాదాలు తెలిపారు. 

తెలుగుదేశం పార్టీకి చెందిన పలువురు కాపు నేతలు పార్టీ వీడనున్నారంటూ విస్తృతంగా ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలోనే బోండా ఉమా పార్టీ మారుతారంటూ ప్రచారం సాగుతోంది.