పదేళ్ళ క్రితంతో పోలిస్తే ఇప్పటి డిపాజిట్లు 10వ వంతుకు పడిపోయిందని స్విస్ బ్యాంకుల కన్సార్టియమే చెబుతోంది. ప్రపంచంలో పలుదేశాలు నల్లధన డిపాజిట్లను గుట్టుగా దాచుకునేవి ఉన్నప్పటికీ భారతీయుల దృష్టి మాత్రం స్విస్ బ్యాంకులపైనే ఉండేది.
స్విస్ బ్యాంకుల నుండి భారతీయుల ఖాతాలు ఇతర దేశాలకు తరలిపోతున్నాయ్. నల్లధన కుబేరులకు ఒకపుడు స్విస్ బ్యాంకు ఎంతో సురక్షితం. స్విస్ బ్యాంకులో ఫలానా నాయకునికి అకౌంట్ ఉందంటే దేశవ్యాప్తంగా పెద్ద గొడవ జరిగేది. అటువంటిది రానురాను దేశంలోని వివిధ రంగల్లోని ప్రముఖులకు స్విస్ బ్యాంకులో ఖాతాలున్నాయన్న ఆరోపణలు పెరిగిపోతున్నాయి. దాంతో స్విస్ బ్యాంకులో ఖాతా అన్నది మామూలైపోయింది.
అదే సమయంలో ఒకప్పటిలా స్విస్ బ్యాంకులో ఖాతా అంత సురక్షితం కాదన్న ప్రచారం కూడా ఊపందుకున్నది. అకౌంట్ల గుట్టురట్టు చేసేందుకు ఇరుదేశాల మధ్య ఒప్పందాలు జరుగుతున్న నేపధ్యంలో అక్రమార్కులు ప్రత్యామ్నాయ మార్గాలను వెతుక్కుంటున్నారు. గతేడాది స్విస్ బ్యాంకుల్లో భారతీయుల డిపాజిట్లు 67.6 కోట్ల స్విస్ ఫ్రాంకులుండేవి. అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే 45 శాతం తగ్గిపోయింది.
పదేళ్ళ క్రితంతో పోలిస్తే ఇప్పటి డిపాజిట్లు 10వ వంతుకు పడిపోయిందని స్విస్ బ్యాంకుల కన్సార్టియమే చెబుతోంది. ప్రపంచంలో పలుదేశాలు నల్లధన డిపాజిట్లను గుట్టుగా దాచుకునేవి ఉన్నప్పటికీ భారతీయుల దృష్టి మాత్రం స్విస్ బ్యాంకులపైనే ఉండేది. దేశంలో ఆరోపణల పెరిగిపోవటం, స్విస్ ఖాతాలూ పెరిగిపోతుండటంతో ఖాతాల గుట్టురట్టు చేసేందుకు ఇరుదేశాల మధ్య ఒప్పందాలు ఊపందుకున్నాయ్. అందుకే ప్రస్తుతం భారతీయులు ప్రత్యామ్నాయమార్గాను వెతుక్కుంటున్నారు.
సింగపూర్, హాంకాంగ్, వర్జిన్ ఐల్యాండ్స్ లాంటి దేశాల్లోని బ్యాంకులకు ఖాతాలు తరలిపోతున్నట్లు స్విస్ బ్యాంకులు చెబుతున్నాయి. విచిత్రమేంటంటే పోయిన ఏడాది చివరికి భారతీయులు దాచుకున్న మొత్తం సుమరు రూ. 4500 కోట్లైతే, పాకిస్ధానీయుల దాచుకున్న నిల్వల మొత్తం రూ 9500 కోట్లు. గడచిన మూడేళ్ళుగా భారతీయుల డిపాజిట్లు తగ్గుతున్నట్లు అక్కడి బ్యాంకులు చెబుతున్నాయి.
