తిరుపతి ఉప ఎన్నికల బరి నుంచి జనసేన తప్పుకున్నట్లుగా తెలుస్తోంది. చాలా రోజులుగా నానుతున్న అంశం మీద ఏపీ బీజేపీ క్లారిటీ ఇచ్చింది. తిరుపతి ఉప ఎన్నికల్లో ఎవరు పోటీ చేస్తారు అనే అంశం మీద ఏపీ బీజేపీ ఇంచార్జ్ మురళీధరన్ క్లారిటీ ఇచ్చారు.

తిరుపతి నుంచి బీజేపీ అభ్యర్థి ఉప ఎన్నికల్లో పోటీ చేస్తారని మురళీధరన్ ట్వీట్ చేశారు. జనసేన మద్దతుతో బీజేపీ అభ్యర్థి పోటీ చేస్తారని ఆయన ట్వీట్ చేశారు.

అంతకుముందు శుక్రవారం హైదరాబాద్‌లో జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు, సీనియర్ నేత సునీల్ డియోదర్ సమావేశమయ్యారు.

చర్చల అనంతరం తిరుపతిలో బీజేపీ అభ్యర్ధే పోటీ చేసేందుకు పవన్ కల్యాణ్ అంగీకరించినట్లుగా తెలుస్తోంది. ఇటీవల తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ కరోనా బారినపడి ప్రాణాలు కోల్పోవడంతో తిరుపతి పార్లమెంట్ కు ఉప ఎన్నికలు జరగనున్నాయి