అమరావతి: వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి లక్ష్మీపార్వతి తనను లైంగికంగా వేధిస్తోందంటూ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టి తెలుగు రాష్ట్రాల్లో హల్ చల్ చేసిన కోటికి షాక్ ఇచ్చింది బీజేపీ. సోమవారం బీజేపీలో చేరిన కోటి తమ పార్టీ సభ్యుడు కాదంటూ ఏపీ బీజేపీ ప్రెస్ నోట్ విడుదల చేసింది. కోటికి బీజేపీలో సభ్యత్వం ఇవ్వలేదంటూ స్పష్టం చేసింది. కోటి బీజేపీలో చేరడం అకస్మాత్తుగా జరిగిందని పేర్కొంది. 

స్థానిక నేతలకు సమాచారం ఇవ్వకుండా కోటి బీజేపీలో చేరారనని చెప్పుకొచ్చారు. అందువల్ల కోటికి బీజేపీ సభ్యత్వం ఇవ్వలేదన్నారు. బీజేపీ నాయకత్వం కోటి సభత్వాన్ని ఖరారు చేయలేదంటూ ప్రకటన విడుదల చేసింది. 

ఈ రాద్ధాంతానికి కారణం సోషల్ మీడియా కావడం విశేషం. కోటి గతంలో లక్ష్మీ పార్వతిపై లైంగిక ఆరోపణలు చేయడంతోపాటు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కోటిపై కూడా ఏపీ డీజీపీ గౌతం సవాంగ్ కు ఫిర్యాదు చేశారు లక్ష్మీపార్వతి. ప్రస్తుతం కోటిపై విచారణ జరుగుతోంది. 

ఈ తరుణంలో కోటి బీజేపీలో చేరారంటూ సోషల్ మీడియాలో ఫోటోలు హల్ చల్ చేశాయి. ఆ ఫోటోలతో నెటిజన్లు బీజేపీని ఒక ఆట ఆడుకున్నారు. చేసిన తప్పులు కప్పిపుచ్చుకోవాలంటే బీజేపీలో చేరాలని నెటిజన్లు ఛలోక్తులు విసిరారు. 

నెట్టింట్లో బీజేపీపై సెటైర్లు వేయడంతో ఏపీ బీజేపీ రాష్ట్ర నాయకత్వం దిగిరావాల్సి వచ్చింది. కోటి బీజేపీ సభ్యులు కాదంటూ వివరణ ఇవ్వాల్సిన పరిస్థితి నెలకొంది. 

ఈ వార్తలు కూడా చదవండి

లక్ష్మీపార్వతి వేధిస్తోందన్న కోటి.. బీజేపీలో చేరాడు