వైసీపీ మహిళా నేత లక్ష్మీ పార్వతి తనను లైంగికంగా వేధిస్తోందంటూ ఇటీవల ఓ వ్యక్తి కలకలం రేపిన సంగతి తెలిసిందే. కాగా... అతను ఇప్పుడు బీజేపీ తీర్థం పుచ్చుకున్నాడు.

కొద్ది రోజుల క్రితం కోటి అనే వ్యక్తి... లక్ష్మీ పార్వతి తనను లైంగికంగా వేధిస్తోంటూ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనతో ఒక్కసారిగా అందరి దృష్టి ఆకర్షించాడు. కాగా... సోమవారం అతను బీజేపీ తీర్థం పుచ్చుకున్నాడు.

విజయవాడలో ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ సమక్షంలో బీజేపీలో చేరాడు. కోటి తనపై దుష్ప్రచారం చేసి పరువుకు భంగం కలిగించాడని తెలంగాణ డీజీపీకి లక్ష్మీపార్వతి గతంలో ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. టాలీవుడ్ నటి పూనమ్ కౌర్ కూడా కోటిపై సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఇలాంటి ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని బీజేపీలో చేర్చుకోవడంపై చర్చ మొదలైంది.