Asianet News TeluguAsianet News Telugu

రాజు మారితే రాజధాని మారుస్తారా.. కేంద్రం ఊరుకోదు: సుజనా చౌదరి

ఆంధ్రప్రదేశ్ రాజధానిపై జీఎన్ రావు కమిటీ ప్రభుత్వానికి సమర్పించిన నివేదికపై బీజేపీ ఎంపీ సుజనా చౌదరి స్పందించారు. 

bjp mp sujana chowdary reacts capital Shifting to visakhapatnam
Author
Amaravathi, First Published Dec 21, 2019, 4:44 PM IST

ఆంధ్రప్రదేశ్ రాజధానిపై జీఎన్ రావు కమిటీ ప్రభుత్వానికి సమర్పించిన నివేదికపై బీజేపీ ఎంపీ సుజనా చౌదరి స్పందించారు. మూడు రాజధానుల ప్రతిపాదనలు, రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి పట్ల కేంద్రం చూస్తూ ఊరుకోదని ఆయన స్పష్టం చేశారు.

రాజధాని మార్చడం అంత తేలికైన వ్యవహారం కాదని, కమిటీ నివేదికపై ప్రజల్లో అనేక అనుమానాలు ఉన్నాయని సుజనా వెల్లడించారు. అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలే తప్పించి రాజధానులు మార్చడం సరైన నిర్ణయం కాదని ఆయన అభిప్రాయపడ్డారు.

Also Read:‘‘మెగా’’ కన్‌ఫ్యూజన్: జగన్‌కి జై కొట్టిన చిరు.. 4 బిల్డింగ్‌లతో అభివృద్ధి కాదన్న పవన్

పరిపాలనపై దృష్టి పెట్టాల్సిందిపోయి వ్యక్తిగత దూషణలపైనే సమయం వృథా చేస్తున్నారని వైసీపీ ప్రభుత్వంపై సుజనా మండిపడ్డారు. రాజుగారు మారినప్పుడల్లా రాజధాని మారుస్తారా.. అసలు కమిటీ ఏం నివేదిక ఇచ్చిందని ఆయన ప్రశ్నించారు.

కమిటీ సభ్యులు ఎప్పుడు, ఎక్కడ పర్యటించారో అసలు ఎవ్వరికీ తెలియదని, ప్రభుత్వం చెప్పినట్లుగా నివేదిక ఇచ్చినట్లుగా ఉందని సుజనా అభిప్రాయపడ్డారు. అమరావతి నుంచి రాజధానిని తరలిస్తే భూములిచ్చిన రైతుల పరిస్ధితి ఏంటని చౌదరి ప్రశ్నించారు.

Also Read:ఏపీకి మూడు రాజధానులు: పవన్ షాకిచ్చిన చిరు, జగన్ జై

రాజధాని విషయంలో ఏపీ సర్కార్‌కు అసలు ఎవరు సలహాలు ఇస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. రాజధాని మార్చితే కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చే సమస్యే ఉండదని, త్వరలోనే ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వ పెద్దలతో చర్చిస్తామని సుజనా చౌదరి పేర్కొన్నారు.

కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే జగన్ ప్రభుత్వం వెళ్తోందని ఆయన విమర్శించారు. అదే సమయంలో ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చే పరిస్థితి లేదని సుజనా అభిప్రాయపడ్డారు. 

Follow Us:
Download App:
  • android
  • ios