కాపులను వైసీపీ, టీడీపీలు మోసం చేశాయి: బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహరావు

కాపులను వైసీపీ, టీడీపీలు మోసం  చేశాయని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహరావు  విమర్శించారు.  దేశంలో  కాపులకు జరిగిన  అన్యాయం  ఏ వర్గానికి  జరగలేదన్నారు.  

BJP MP GVL Narasimha Rao  Slams YS Jagana Government over Kapu Reservations

హైదరాబాద్: కాపులను  వైసీపీ, టీడీపీలు మోసం  చేశాయని బీజేపీ  ఎంపీ  జీవీఎల్ నరసింహరావు  విమర్శించారు. ఆదివారంనాడు   విశాఖపట్టణంలో  జీవీఎల్ నరసింహరావు  మీడియాతో మాట్లాడారు.  కాపులకు జరిగిన అన్యాయం దేశంలో  ఏ  వర్గానికి జరగేలేదన్నారు.  కాపుల రిజర్వేషన్లను  అవాస్తవాలను  ప్రచారం చేస్తున్నారని  ఆయన మండిపడ్డారు.  కాపు రిజర్వేషన్ల అంశంపై   టీడీపీ సర్కార్  ఏం చేసిందని ఆయన ప్రశ్నించారు. పారిశ్రామిక కారిడార్లకు అవసరమైన భూ సేకరణలో  ఏపీ సర్కార్  మీన మేషాలు లెక్కిస్తుందని  ఆయన  విమర్శించారు. విశాఖలో   పారిశ్రామిక కారిడార్   కోసం  అవసరమైన  భూ సేకరణ ఎంతవరకు వచ్చిందని  ఆయన  రాష్ట్ర ప్రభుత్వాన్ని  ప్రశ్నించారు. 

ఎక్కడ భూదోపీడీ,  కుంభకోణాలు చేసే0ందుకు  అవకాశం ఉందో   చూసి  అక్కడే  వైసీపీ సర్కార్ పనులు చేస్తుందని   జీవీఎల్ నరసింహరావు  ఆరోపించారు. ఈ ఏడాది మార్చి మాసంలో   విశాఖపట్టణంలో  నిర్వహించే గ్లోబల్ ఇన్వెస్టర్ల  సదస్సులో  ఏం చెబుతారని  జీవీఎల్ ప్రశ్నించారు. పారిశ్రామిక కారిడార్లను  ప్రారంభించలేకపోయామని  చెబుతారా   ప్రభుత్వాన్ని అడిగారు జీవీఎల్ నరసింహరావు. రాష్ట్రం నుండి ఇతర ప్రాంతాలకు పరిశ్రమలను వెళ్లగొట్టడంలో  తాము సిద్దహస్తులమని  పెట్టుబడిదారుల సమావేశంలో  చెబుతారా అని జగన్  సర్కార్ పై  జీవీఎల్ నరసింహరావు  ప్రశ్నల వర్షం కురిపించారు.

also read:ఎన్నికల సమయంలో కాపుల చుట్టూ పార్టీలు: బీజేపీ నేత కన్నా కీలక వ్యాఖ్యలు

ఆంధ్రప్రదేశ్  ప్రభుత్వం ఈ ఏడాది  మార్చి మాసంలో  గ్లోబల్ ఇన్వెస్టర్ల  సమ్మిట్  ను నిర్వహించనుంది.    ఈ సమ్మిట్  నిర్వహించడానికి ముందే  విశాఖకు రాజధానిని తరలించాలని జగన్ ప్రభుత్వం భావిస్తుంది.   ఇటీవల ఢిల్లీలో  జరిగిన  సమావేశంలో   సీఎం జగన్  పాల్గొన్నారు. మార్చిలో  విశాఖలో  జరిగే  సమావేశానికి  ఇన్వెస్టర్లను ఆహ్వానించారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios