ఎన్నికల సమయంలో కాపుల చుట్టూ పార్టీలు: బీజేపీ నేత కన్నా కీలక వ్యాఖ్యలు

ఎన్నికల సమయంలో   కాపుల చుట్టూ  పార్టీలు తిరుగుతున్నాయని  బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ  చెప్పారు.  

BJP Leader  Kanna Lakshminarayana Key Comments  On  Kapu Caste

గుంటూరు: ఎన్నికల సమయంలో  కాపుల చుట్టూ  పార్టీలు తిరుగుతున్నాయని  బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ  చెప్పారు.శుక్రవారం నాడు  బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ మీడియాతో మాట్లాడారు  రాష్ట్రంలో  22 శాతం  ఓటు బ్యాంకు కాపు సామాజిక వర్గానికి  ఉందని  ఆయన  చెప్పారు.  1989 నుండి కాపులు మద్దతు ఇచ్చిన పార్టీలు రాష్ట్రంలో  విజయం సాధిస్తున్నారని  కన్నా లక్ష్మీనారాయణ గుర్తు  చేశారు. ఎన్నికల సమయంలో  కాపులను పార్టీలు వాడుకుంటున్నాయన్నారు. ఓబీసీ కోటా కింద కాపులను చేర్చాలని  ఆయన  కోరారు.  జీవీఎల్ నరసింహరావు  ఏం సాధించారని కాపులు  ఆయన కు  సన్మానం చేస్తున్నారో అర్ధం కావడం లేదన్నారు. కాపులను  ఏకతాటిపైకి తీసుకు రావడం తన వల్ల  కాదన్నారు. 
జనసేనను అధికారంలోకి  తీసుకురావాలనే నిర్ణయాన్ని పవన్ కళ్యాణ్ కే వదిలేయాలన్నారు.  జనసేనను ఏర్పాటు  చేసి  9 ఏళ్లు అవుతుందన్నారు.  పార్టీ ఎలా నడపాలో  పవన్ కళ్యాణ్  కు తెలుసునని ఆయన చెప్పారు. 

ఇటీవల కాలంలో  ఏదో ఒక  కామెంట్స్  చేస్తూ  కన్నా లక్ష్మీనారాయణ వార్తల్లో నిలుస్తున్నారు.  బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుపై  మీడియా వేదికగా  విమర్శలు  చేసిన విషయం తెలిసిందే . బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు కూడా ఆయన దూరంగా  ఉన్నార. రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి కూడా కన్నా లక్ష్మీనారాయణ హజరు కాలేదు.  వ్యక్తిగత కారణాలతో ఈ రెండు సమావేశాలకు దూరంగా  ఉన్నారు. జనసేనలో  కన్నా లక్ష్మీనారాయణ చేరుతారనే ప్రచారం కూడా సాగింది. అయితే ఈ ప్రచారాన్ని కన్నా లక్ష్మీనారాయణ ఖండించారు. 

బీజేపీ ఆర్గనైజింగ్  సెక్రటరీ  శివప్రకాష్ తో  కన్నా లక్ష్మీనాారాయణ ఇటీవల భేటీ అయ్యారు. పార్టీలో  చోటు చేసుకున్న పరిణామాలపై  చర్చించారు.  తనపై పార్టీలో ఓ వర్గం  చేస్తున్న  విమర్శలపై  శివప్రకాష్ తో కన్నా లక్ష్మీనారాయణ  చర్చించిన విషయం తెలిసిందే.,
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios