బాబు, కేజ్రీవాల్ పై జీవీఎల్ ధ్వజం


న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ చేపట్టిన నిరసనకు నాలుగు రాష్ట్రాల సీఎంలు మద్దతు తెలపడాన్ని రాజ్యసభ సభ్యుడు, బీజేపీ అధికార ప్రతినిధి జీవీఎల్‌ నరసింహరావు తీవ్రంగా వ్యతిరేకించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అద్భుతంగా పాలిస్తున్నారని, రాష్ట్రాలతో స్నేహ పూర్వకంగా వ్యవహరిస్తున్నారని చెప్పారు. రాష్ట్రాలకు గతంతో పోల్చితే రెట్టింపు నిధులు ఇస్తున్నారని జీవీఎల్‌ గుర్తు చేశారు.ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌లు సీఎంగా విఫలమయ్యారన్నారు. తమ అసమర్ధతను కప్పిపుచ్చుకోవడానికే సీఎంలు నిరసన చేపడుతున్నారని విమర్శించారు.

చంద్రబాబు, కేజ్రీవాల్‌లపై ట్వీట్‌లో జీవీఎల్‌ మండిపడ్డారు. చంద్రబాబు, కేజ్రీవాల్‌ల మధ్య కామన్‌ పాయింట్‌ ఉంది. సీఎంలుగా బాధ్యతలు నిర్వహించడంలో ఈ ఇద్దరూ విఫలమయ్యారు. 

తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే దీక్షలు, నిరసనలు చేపడుతున్నారు. చంద్రబాబు ఫైవ్‌ స్టార్‌ నిరసనల పేరిట ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ నిధుల కోసమే తాను ఇలా చేస్తున్నానని చెబుతుంటారని ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు.

తమ స్వార్ధ ప్రయోజనాల కోసం ప్రభుత్వ అధికారులను ఉపయోగించారని జీవీఎల్‌ విమర్శించారు. చంద్రబాబు తన రాజకీయాల కోసం నాన్‌ గెజిటెడ్‌ కార్మికులను ఉపయోగించడంలో నిపుణుడని చెప్పారు