చంద్రబాబుపై నిప్పులు చెరిగిన జీవీఎల్ నరసింహారావు

Bjp MP GVL Narasimha Rao serious comments on Chandrababunaidu
Highlights

బాబుపై బిజెపి విమర్శలు

న్యూఢిల్లీ:ఏపీ రాష్ట్రానికి ఇచ్చిన హమీలను అమలు చేసేందుకు ప్రయత్నిస్తున్నామని  బిజెపి ఎంపీ జీవీఎల్ నరసింహారావు చెప్పారు. కడప ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలనే డిమాండ్ తో టిడిపి ఎంపీ సీఎం రమేష్ దీక్ష చేయడాన్ని ఆయన తప్పుబట్టారు. 

బుధవారం నాడు  న్యూఢిల్లీలో  జీవీఎల్ నరసింహరావు  మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం, టిడిపి నేతలు ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఏపీకి అవసరమైన  ఆర్ధిక సహాయం చేసేందుకు  కేంద్రం సిద్దంగా ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం  తీసుకోవడానికి సిద్దంగా లేదన్నారు.  

రాజకీయ ప్రయోజనాలు మినహ టిడిపి నేతలకు  ఇతర విషయాలు పట్టలేదన్నారు. కడపలో ఉక్కు కర్మాగారం విషయమై దీక్ష చేస్తున్న ఎంపీ చంద్రబాబునాయుడు వద్ద ధర్నా నిర్వహించాలని ఆయన సూచించారు.విభజన హమీలను అమలు చేసేందుకు  తాము సిద్దంగా ఉన్నామని ఆయన చెప్పారు. కానీ, రాష్ట్ర ప్రభుత్వం నుండి సహకారం లభించడంలేదని ఆయన ఆరోపించారు.


 

loader