సీఎం జగన్ కామెంట్స్ సుప్రీం కోర్టును వెక్కిరించినట్లే.. బీజేపీ ఎంపీ జీవీఎల్ నర్సింహారావు
ఆంధ్రప్రదేశ్ రాజధానిని విశాఖపట్నంకు తరలిస్తామని సీఎం జగన్ చేసిన ప్రకటనపై ప్రతిపక్ష పార్టీలు విమర్శల వర్షం కురిపిస్తున్నాయి. సీఎం జగన్ వ్యాఖ్యలపై స్పందించిన బీజేపీ ఎంపీ జీవీఎల్ నర్సింహారావు.. రాజధాని అంశం సుప్రీం కోర్టులో పెండింగ్‌లో ఉందని అన్నారు.

ఆంధ్రప్రదేశ్ రాజధానిని విశాఖపట్నంకు తరలిస్తామని సీఎం జగన్ చేసిన ప్రకటనపై ప్రతిపక్ష పార్టీలు విమర్శల వర్షం కురిపిస్తున్నాయి. సీఎం జగన్ వ్యాఖ్యలపై స్పందించిన బీజేపీ ఎంపీ జీవీఎల్ నర్సింహారావు.. రాజధాని అంశం సుప్రీం కోర్టులో పెండింగ్‌లో ఉందని అన్నారు. సీఎం జగన్ వ్యాఖ్యలు వివాదంగా మారాయని చెప్పారు. రాజధాని అంశంపై సుప్రీం కోర్టు ఆదేశాలు రావాల్సి ఉందని అన్నారు. సీఎం జగన్ ముందే ఎలా ప్రకటన చేస్తారని ప్రశ్నించారు.
విశాఖపట్నం రాజధాని కానుందని.. తాను అక్కడికి షిఫ్ట్ అవుతానని సీఎం జగన్ ఎలా అంటారని జీవీఎల్ ప్రశ్నించారు. సీఎం జగన్ కామెంట్స్ సుప్రీం కోర్టును వెక్కిరించినట్లేనని విమర్శించారు. రెండు రాష్ట్రాల సమస్యలపై ఇద్దరు సీఎంలు ఎందుకు కలిసి చర్చించరని ప్రశ్నించారు.
ఇక, సీఎం జగన్ మంగళవారం ఢిల్లీ జరిగిన ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్ల సదస్సు సన్నాహక సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. ‘‘మా రాజధాని కానున్న విశాఖపట్నంకు మిమ్మల్ని ఆహ్వానించేందుకు వచ్చాను. నేను కూడా వైజాగ్‌కి షిఫ్ట్ అవుతాను’’ అని అన్నారు. ఇక, మార్చి 3, 4 తేదీల్లో విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్శిటీ గ్రౌండ్స్‌లో నిర్వహించనున్న గ్లోబల్ ఇన్వెస్టర్ల సమ్మిట్ ద్వారా రాష్ట్రంలోకి భారీ పెట్టుబడులను ఆకర్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం వరుస కార్యక్రమాలను నిర్వహించాలని యోచిస్తోంది.