ఏపీలోని జగన్ ప్రభుత్వంపై తమ పార్టీ సీరియస్‌గా వుందన్నారు బీజేపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్. ఏపీలో వచ్చేది బీజేపీ సంకీర్ణ ప్రభుత్వమేనని సీఎం రమేష్ జోస్యం చెప్పారు. 

బీజేపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలోని జగన్ ప్రభుత్వంపై తమ పార్టీ సీరియస్‌గా వుందన్నారు. వైసీపీ సర్కార్‌ను ఉపేక్షించే స్థితిలో కేంద్రం లేదని.. రాష్ట్రంలో కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయని సీఎం రమేశ్ ఆరోపించారు. వాస్తవాలను బయటపెడుతున్న మీడియాపై కూడా దాడులు జరుగుతున్నాయని.. రైతు సమస్యలను జగన్ పట్టించుకోవడం లేదన్నారు. సంక్షేమ పథకాల పేరుతో ప్రజలకు పది రూపాయలు ఇచ్చి, 100 లాక్కుంటుందని ఆరోపించారు. బీజేపీ అధిష్టానం అన్ని గమనిస్తోందని.. ఏపీలో వచ్చేది బీజేపీ సంకీర్ణ ప్రభుత్వమేనని సీఎం రమేష్ జోస్యం చెప్పారు.