టీడీపీ-బీజేపీ మైత్రి బంధంపై బీజేపీ నేత, ఎమ్మెల్సీ సోము వీర్రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ మద్దతు కారణంగా చిత్రహింసలు అనుభవించామని అన్నారు. టీడీపీ మద్దతు ఇంకా కొనసాగి ఉంటే తమకు ఆత్మహత్యలే శరణ్యం అయ్యేది అంటూ చేసిన ప్రకంపన ఇరుపార్టీలోనూ కలకలం రేపుతున్నాయి.

శనివారం మీడియాతో మాట్లాడుతూ రాయలసీమపై చంద్రబాబు సవతితల్లి ప్రేమ చూపిస్తోందని మండిపడ్డారు. పోలవరాన్ని రాష్ట్ర నిధులతో పూర్తి చేస్తామని టీడీపీ నేతలు చెప్పటాన్ని తప్పుపట్టారు. పెండింగ్ ప్రాజెక్టులన్నింటినీ రాష్ట్ర నిధులతోనే పూర్తి చేయాలన్నారు. కడప ఉక్కుపరిశ్రమ ఏర్పాటుపై తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందన్నారు. కేంద్రం ఇచ్చిన నిధులతో రాష్ట్రంలో ఏం అభివృద్ధి చేశారో చూపించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.