అనంతపురం: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై విరుచుకుపడ్డారు బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు. చంద్రబాబు నాయుడు 17 కేసుల్లో స్టే తెచ్చుకుని తిరుగుతున్నారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 

స్టే తెచ్చుకుని తిరుగుతూ ఇతరులపై నిందలు వేయడం చంద్రబాబుకే సాధ్యమంటూ ఆయన ఎద్దేవా చేశారు. అనంతపురం జిల్లాలో పర్యటిస్తున్న సోము వీర్రాజు ఓటమి భయంతోనే చంద్రబాబు రోజుకో డ్రామాలు ఆడుతున్నారని విమర్శించారు. 

అన్ని శాఖలపై సమీక్షలు చేస్తున్న చంద్రబాబు రైతులకు గిట్టుబాటు ధరపై ఎందుకు రివ్యూ నిర్వహించడం లేదో చెప్పాలని డిమాండ్ చేశారు. తెలుగుదేశం పార్టీ ఓడిపోవడం ఖాయమని అందులో ఎలాంటి సందేహం లేదన్నారు ఎమ్మెల్సీ సోసము వీర్రాజు.