మీరు సహకరిస్తే.. టీడీపీపై అవిశ్వాసం.. వైసీపీని కోరిన మాధవ్

First Published 22, Jul 2018, 12:45 PM IST
BJP MLC Madhav Fires on Madhav
Highlights

తెలుగుదేశం పార్టీపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్.. బీజేపీపై బురద జల్లేందుకు లోక్‌సభలో టీడీపీ చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయని ఆయన అన్నారు.

తెలుగుదేశం పార్టీపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్.. బీజేపీపై బురద జల్లేందుకు లోక్‌సభలో టీడీపీ చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయని ఆయన అన్నారు.. అవిశ్వాస తీర్మానం వీగిపోవడంతో తెలుగుదేశానికి ఎదురుదెబ్బ తగిలిందని.. ఆ పార్టీపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని.. దానిని కప్పిపుచ్చుకునేందుకే టీడీపీ చౌకబారు రాజకీయాలకు పాల్పడుతోందని విమర్శించారు.

లోక్‌సభలో టీడీపీ ఎంపీ కేశినేని నాని చేసిన వ్యాఖ్యలు ఏ మాత్రం బాలేవని.. తెలుగుదేశం, కాంగ్రెస్‌ల స్నేహబంధానికి లోక్‌సభ వేదికగా నిలిచిందన్నారు. రాజీనామాలు చేసి వైసీపీ పనికిరాని పక్షంగా మిగిలిపోయిందని.. తమ తరపున పోరాటం చేయమని ప్రజలు ఎన్నుకుంటే పోరాటం సాగించకుండా అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించడం దారుణమన్నారు.. వైఎస్సార్ కాంగ్రెస్ సహకరిస్తే.. టీడీపీపై తాము అవిశ్వాసం పెట్టేందుకు సిద్ధమని మాధవ్ అన్నారు. 

loader