బీజేపీ అంటే బాబు, జగన్, పవన్ - కాంగ్రెస్ ఏపీ చీఫ్ వైఎస్ షర్మిల..

బీజేపీ అంటే బాబు, జగన్, పవన్ కల్యాణ్ అని కాంగ్రెస్ ఏపీ చీఫ్ వైఎస్ షర్మిల విమర్శించారు. 10 ఏళ్ల పాటు ప్రత్యేక హోదా ఇస్తా అని చెప్పిన బీజేపీ మాట మార్చిందని అన్నారు. కాంగ్రెస్ తోనే ఏపీకి ప్రత్యేక హోదా సాధ్యమవుతుందని ఆమె తెలిపారు.

BJP means Babu, Jagan, Pawan - Congress AP chief YS Sharmila..ISR

ఏపీసీసీ చీఫ్ వైస్ షర్మిల బీజేపీ, టీడీపీ, జనసేన, వైసీపీలపై విమర్శలు చేశారు. గురువారం ఆమె మాట్లాడుతూ.. ఏపీకి ప్రత్యేక హోదా సాధన పై భావోద్వేగ పూరిత ప్రసంగం చేశారు. కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదా కోసం ఉద్యమించాలని నిర్ణయించుకుందని అన్నారు. ఈ విషయాన్ని తమ పార్టీ భుజాన వేసుకుందని చెప్పారు. ఉద్యమం ఉవ్వెత్తున జరగక పోతే మనకు హోదా రాదని అన్నారు. దీని కోసం 10 ఏళ్లలో ఏ ఒక్కరూ పోరాటం చేసింది లేదని విమర్శించారు.

ప్రభుత్వ ఉద్యోగులకు షాక్.. ‘నో వర్క్, నో పే’ నిబంధన ప్రవేశపెట్టిన ప్రభుత్వం..

ప్రత్యేక హోదా - ఆంధ్రుల హక్కు అని వైఎస్ షర్మిల అన్నారు. ప్రజలు  గొర్రెలు లెక్క కాకుండా సింహాల మాదిరిగా బతకాలని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అన్నారని ఆమె గుర్తు చేశారు. గొర్రెలను బలి ఇస్తారని, సింహాలను బలి ఇవ్వరని అన్నారని ఆమె చెప్పారు. ప్రత్యేక హోదా విషయంలో మనం 10 ఏళ్లు గొర్రెలం అయ్యామని తెలిపారు. అందుకే మనల్ని బలి ఇచ్చారని తెలిపారు. మొదటి 5 ఏళ్లు చంద్రబాబు, తర్వాత మరో ఐదేళ్లు జగన్ అందరినీ గొర్రెలను చేశారని ఆరోపించారు.

వచ్చే ఐదేళ్లలో ప్రపంచ ఆర్థిక వృద్ధిలో భారత్ ది కీలక పాత్ర - ఐఎంఎఫ్

ఇప్పుడు సింహాల మాదిరిగా పోరాటం చేస్తేనే ప్రత్యేక హోదా వస్తుందని అన్నారు. ఆంధ్రులను మోసం చేసిన మోడీ ఒక డి ఫాల్టర్ అని షర్మిల ఘాటుగా విమర్శించారు. హోదా వచ్చి ఉంటే 15 లక్షల కోట్ల రూపాయలు వచ్చేవని, దీంతో ఎంతో అభివృద్ధి జరిగి ఉండేదని అన్నారు. చంద్రబాబుకు, తన సోదరుడికి కూడా ఏపీ రాష్ట్ర అభివృద్ధిపై ధ్యాస లేదని అన్నారు. మాట ఇచ్చి మడత పెట్టిన ఘనత జగన్ ది అని విమర్శించారు. 

మాజీ మంత్రి మల్లారెడ్డి అల్లుడికి షాక్.. ఎంఎల్‌ఆర్‌ఐటీ కాలేజ్ ను కూల్చేసిన అధికారులు..

వ్యక్తిగత రాజకీయాల తాను ఏపీకి రాలేదని, అవే కాలంటే 2019లో ఇక్కడ పార్టీ ఏర్పాటు చేసేదాన్ని అని  అన్నారు. కేవలం హోదా సాధన, విభజన సమస్యల సాధన కోసమే ఏపీ రాజకీయాల్లో అడుగుపెట్టానని తెలిపారు. ప్రత్యేక హోదా ఇస్తానని రాహుల్ గాంధీ మాట ఇచ్చారని, అందుకే వైఎస్ఆర్ బిడ్డ ఏపీలో అడుగుపెట్టిందని అన్నారు. హోదా కోసం కాంగ్రెస్ శ్రేణులు ఉద్యమించాలని కోరారు. 

ప్రధాని మోడీపై వ్యాఖ్యలు చేసేటప్పుడు జాగ్రత్త.. రాహుల్ గాంధీకి ఈసీ సూచన

బీజేపీకి ఏపీలో ఒక్క ఎమ్మెల్యే, ఎంపీ లేరని, అయినా ఆ పార్టీ రాజ్యం ఏలుతోందని షర్మిల ఆరోపించారు. చంద్రబాబు నాయుడు, జగన్ ఆంధ్ర రాష్ట్ర ప్రజలను తాకట్టు పెట్టారని విమర్శించారు. బాబు అధికారంలో, జగన్ అధికారంలో ఉన్న బీజేపీ ఉన్నట్టే అని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదా ఐదేళ్లు ఇస్తానంటే, బీజేపీ పదేళ్ల ఇస్తానని చెప్పిందని, కానీ చివరికి ఎగనామం పెట్టిందని విమర్శించారు. ఆంధ్ర అభివృద్ధి తనదే హామీ అన్న ప్రదాని మోడీ కూడా దానిని నెవరేర్చలేదని అన్నారు. బీజేపీ అంటే బాబు, జగన్, పవన్ అని ఆమె విమర్శించారు. వైసీపీ, టీడీపీ, జనసేనలకు ఓటు వేస్తే బీజేపీకి ఓటు వేసినట్టే అని షర్మిల అన్నారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios