విజయసాయికి బిజెపి మద్దతు

First Published 24, Mar 2018, 12:11 PM IST
Bjp leaders supporting ycp mp vijaya sai against naidu
Highlights
  • ఒకవైపు చంద్రబాబునాయుడు ఎంపిని ప్రతీరోజు తూర్పారపడుతుంటే మరోవైపు అదే ఎంపికి బిజెపి సంపూర్ణంగా మద్దతుగా నిలబడుతుండటం గమనార్హం.

వైసిపి రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డికి బిజెపి మద్దతుగా నిలబడుతోంది. ఒకవైపు చంద్రబాబునాయుడు ఎంపిని ప్రతీరోజు తూర్పారపడుతుంటే మరోవైపు అదే ఎంపికి బిజెపి సంపూర్ణంగా మద్దతుగా నిలబడుతుండటం గమనార్హం. ఆర్ధిక నేరగాళ్ళకు పిఎంవోలో ఏం పనంటూ చంద్రబాబు మండిపడుతున్నారు. నేరగాళ్ళకు ప్రధాని కార్యాలయం అడ్డాగా మారిందన్నట్లుగా చంద్రబాబు మండిపడుతున్న విషయం తెలిసిందే.

అదే సమయంలో విజయసాయి పిఎంవో లో కనబడితే తప్పేంటంటూ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు కౌంటర్ ఇచ్చారు. ఎంపికి మద్దతుగానే మాట్లాడారు. అదే తరహాలో తాజాగా బిజెపి ముఖ్య అధికార ప్రతినిధి సుదీష్ రాంభొట్ల కూడా ఎంపికి మద్దతుగా నిలిచారు. విజయసాయి ప్రధాని కార్యాలయంలో తిరిగితే తప్పేమీ లేదన్నారు. దాంతో చంద్రబాబుకు, టిడిపి నేతలకు ఏమని సమాధానం చెప్పాలో అర్ధం కావటం లేదు.

loader