అమరావతి:  ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు నాడు తాను మాట తప్పబోనని, మడమ తిప్పబోనని అన్నారని, కానీ ఇప్పుడు అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని బిజెపి నేత విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. కాంట్రాక్టు ప్రాతిపదికన పనిచేస్తున్న ఉద్యోగులను తాను అధికారంలోకి వచ్చిన తర్వాత రెగ్యులర్ చేస్తానని అన్నారని ఆయన గుర్తు చేశారు. నేడు వారు ఆందోళన చేస్తున్నా జగన్ స్పందించడం లేదని విష్ణువర్ధన్ రెడ్డి విమర్శించారు. జగన్ తన మాట నిలబెట్టుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

విష్ణువర్ధన్ రెడ్డి ఇంకా ఏమన్నారో వీడియో చూడండి

"