రాష్ట్రం లో హిందూ ఆలయాల పై దాడులు పెరిగిపోతున్నాయన్నారు ఏపీ బీజేపీ వ్యవహారాల ఇన్‌ఛార్జి సునీల్ ధియోధర్. అమరావతిలో ఆదివారం మీడియాతో మాట్లాడిన ఆయన... విజయవాడ లో సీతాదేవి‌ విగ్రహం కూల్చిన ఘటన బాధాకరమన్నారు.

వైసిపి అధికారంలోకి వచ్చాక 150 వరకు ఘటనలు వరుసగా జరిగాయని.. వీటిని నియంత్రించడంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని సునీల్ మండిపడ్డారు.

కనీసం సం‌ఘటన జరిగిన ప్రదేశాలను కూడా మంత్రులు పరిశీలించడం లేదని ఆయన ఎద్దేవా చేశారు. సిఎం మౌనం గా ఉన్నారంటే ఏమనుకోవాలని... దేవాదాయ శాఖ మంత్రిపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని సునీల్ విమర్శించారు.

రాష్ట్రం లో శాంతి‌ భద్రతలకు‌ విఘాతం కలుగుతుంటే ఏం చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. ఒక్క కేసులో అయినా దోషులను పట్టుకోలేక పోయారని.. రామతీర్థం విషయంలో రాజకీయం చేయడం సరి కాదని సునీల్ హితలు పలికారు.

చంద్రబాబు ఇప్పుడు మొసలి కన్నీరు కారుస్తున్నారని...ఆయన సిఎం గా 50 ఆలయాలను పడగొట్టించారని ఎద్దేవా చేశారు. హిందూ ఆలయాల పై దాడులను బిజెపి తీవ్రంగా ఖండిస్తుందన్న సునీల్ ధియోధర్.... ప్రభుత్వ తీరుకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా పోరాటం చేస్తామని హెచ్చరించారు.