Asianet News TeluguAsianet News Telugu

ఆన్ లైన్లో నామినేషన్లు... రేపు గవర్నర్ ను కలవనున్న జనసేన, బీజేపీ బృందం

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మొదలైన స్థానిక ఎన్నికల ప్రక్రియ విషయంలో ప్రభుత్వ వ్యవహార శైలిని గవర్నర్ దృష్టికి తీసుకువెళ్ళాలని బిజెపి,జనసేన బృందం నిర్ణయించింది.

BJP Janasena  team plans to AP Governor over panchayat elections
Author
Vijayawada, First Published Jan 27, 2021, 6:38 PM IST

విజయవాడ: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ని జనసేన, భారతీయ జనతా పార్టీ నేతల బృందం గురువారం ఉదయం 11గం.30 ని.లకు కలవనున్నారు. రాష్ట్రంలో మొదలైన స్థానిక ఎన్నికల ప్రక్రియ విషయంలో ప్రభుత్వ వ్యవహార శైలిని గవర్నర్ దృష్టికి ఈ బృందం తీసుకువెళ్ళనున్నట్లు సమాచారం. జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు   నేతృత్వంలో ఇరు పార్టీల నేతలు రాజ్ భవన్ కు వెళ్ళనున్నారు. రాష్ట్రంలో ప్రారంభమయిన పంచాయతీ ఎన్నికల ప్రక్రియ నిష్పాక్షికంగా, పారదర్శకంగా నిర్వహించేలా చూడాలని... అందుకు అనుగుణంగా ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని కోరనున్నారు. ఆన్ లైన్లో నామినేషన్లు స్వీకరించేలా ఎస్.ఈ.సి.కి ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేయనున్నట్లు జనసేన ప్రకటిచింది.

ఇకపోతే ఎలాంటి ఇబ్బందుల్లేకుండా పంచాయతీ ఎన్నికలు నిర్వహించడంపై నిమ్మగడ్డ రమేష్ కుమార్, ఆదిత్యనాథ్ దాస్ తో గవర్నర్ ఇప్పటికే చర్చించారు. బుధవారం ఉదయం ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్, ఏపీ సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ లతో గవర్నర్ సమావేశమయ్యారు.  ఎన్నికల నిర్వహణ విషయంలో ఇద్దరు అధికారులతో ఆయన చర్చించారు. వేర్వేరుగానే ఈ ఇద్దరు నేతలు ఇవాళ గవర్నర్ తో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఇద్దరు కీలక అదికారులకు గవర్నర్ పలు సూచనలు చేశారు.

read more ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు: సోము వీర్రాజు, నాదెండ్ల మనోహార్ భేటీ

ప్రభుత్వం-ఎస్‍ఈసీ మధ్య అంతరం తగ్గించేందుకు ఆయన ప్రయత్నించారు. ఇద్దరూ పరస్పరం సహకరించుకోవాలని సూచించారు. పంచాయతీరాజ్ అధికారుల అభిశంసనపై ఎస్‍ఈసీతో గవర్నర్ మాట్లాడారు. శాంతిభద్రతలు, ఎన్నికల ఏర్పాట్లపై సీఎస్ ఆదిత్యనాథ్‍తో గవర్నర్ చర్చించారు. పోలింగ్‍తోపాటు వ్యాక్సినేషన్‍కి తీసుకుంటున్న చర్యలపై సీఎస్‍తో ఆయన చర్చించారు.

రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణ విషయంలో ఏపీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్, ప్రభుత్వానికి మధ్య అంతరం కొనసాగుతోంది. ఈ పరిణామాల నేపథ్యంలో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఎన్నికల నిర్వహణ విషయంలో ప్రభుత్వం దిగొచ్చింది. ఎన్నికల సంఘం ప్రకటించిన షెడ్యూల్ ప్రకారంగా ఎన్నికల నిర్వహణకు సహకరిస్తామని ఏపీ ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ పరిణామాల నేపథ్యంలో ఇవాళ ఈ ఇద్దరు నేతలు గవర్నర్ తో  సమావేశమై ఎన్నికల నిర్వహణకు తీసుకొన్న చర్యలపై చర్చించారు.

Follow Us:
Download App:
  • android
  • ios