అమరావతి:  ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో బీజేపీ, జనసేన నేతలు బుధవారం నాడు విజయవాడలో సమావేశమయ్యారు.విజయవాడలోని బీజేపీ కార్యాలయంలో బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, జనసేన నేత నాదెండ్ల మనోహర్ లు సమావేశమయ్యారు.

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఈ ఎన్నికల్లో బీజేపీ, జనసేనలు ఉమ్మడిగా పోటీ చేయనున్నాయి.ఏఏ స్థానాల్లో ఏ పార్టీలు పోటీ చేయాలనే విషయమై రెండు పార్టీల నేతలు చర్చించనున్నారు. రెండు రోజుల క్రితం పవన్ కళ్యాణ్ తో సోము వీర్రాజు భేటీ అయ్యారు. ఈ భేటీకి కొనసాగింపుగానే  ఇవాళ సమావేశం కొనసాగుతోంది.

ఈ రెండు పార్టీలు అసెంబ్లీ ఎన్నికల వరకు కలిసి పోటీ చేయాలని నిర్ణయం తీసుకొన్న విషయం తెలిసిందే. స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు త్వరలో జరిగే తిరుపతి ఎంపీ స్థానానికి కూడ ఎన్నికల్లో పోటీ విషయమై కూడ చర్చించే అవకాశం ఉందని సమాచారం.స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ సత్తా చాటాలని ఈ కూటమి భావిస్తోంది.