వచ్చే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఒంటరి పోరాటం చేయటానికే నిర్ణయించుకున్నది. జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తో శనివారం సాయంత్రం జరిగిన కీలక భేటీలో పై నిర్ణయం తీసుకున్నారు. ఎన్డీఏలో నుండి చంద్రబాబునాయుడు బయటకు వచ్చేసిన వెంటనే ఏపి బిజెపి నేతలతో అమిత్ సమావేశమవటంతో ప్రాధాన్యత ఏర్పడింది. ఈ భేటీలో జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపి ఇన్చార్జి రామ్ మాధవ్ కూడా సమావేశమయ్యారు.

వచ్చే ఎన్నికల్లో స్వతంత్రంగా పోటీ చేయటానికే మెజారిటీ నేతలు మొగ్గు చూపారు. అదే సమయంలో ఒంటిరి పోటికి వీలుగా రాష్ట్రంలోని అన్నీ నియోజకవర్గాల్లో నేతలు, శ్రేణులను సిద్ధం చేసుకొవాలని అమిత్ ఆదేశించారు. గట్టి అభ్యర్ధులను రంగంలోకి దింపటంలో భాగంగా ఇతర పార్టీల నుండి వచ్చే నెతలకు ప్రాధాన్యత ఇవ్వాలని కూడా భేటీలో నిర్ణయమైంది. బహుశా టిడిపి, కాంగ్రెస్ నుండే నేతలు బిజెపిలో చేరుతారని అంచనా వేస్తున్నది బిజెపి.