సినీనటుడు శివాజిపై బిజెపి కార్యకర్తలు దాడి చేశారు. ప్రత్యేకహోదా కోసం ఓ మీడియా సంస్ధ నిర్వహించిన చర్చా కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన హీరోపై హటాత్తుగా బిజెపి కార్యకర్తలు దాడి చేయటంతో అందరూ బిత్తరపోయారు.  హోదాపై హీరో తన అభిప్రాయాలు చెబుతుండగా స్టూడియోలోకి అనుమతి లేకుండానే హటాత్తుగా బిజెపి కార్యకర్తలు చొరబడ్డారు. శివాజికి వ్యతిరేకంగా నినాదాలు మొదలుపెట్టారు. శివాజి డౌన్ డౌన్ అంటూ గట్టిగా నినాదాలు మొదలుపెట్టారు.

హీరో ప్రసంగాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించగా శివాజీ కూడా రెచ్చిపోయారు. మోడికి, కేంద్రప్రభుత్వానికి వ్యతిరేకంగా తన వాదనను మరింత గట్టిగా వినిపించటం మొదలుపెట్టారు. దాంతో కార్యకర్తలు ఒక్కసారిగా శివాజి మీద దాడి చేశారు. అయితే, అక్కడే ఉన్న ప్రజాసంఘాలు కార్యకర్తలను అడ్డుకునే ప్రయత్నం చేసినా సాధ్యం కాలేదు.

ఒక్కసారిగా కార్యకర్తలు చుట్టుముట్టడంతో ఎవరు ఎవరిపై దాడి చేస్తున్నారో అర్ధం కాలేదు. అక్కడే ఉన్న కాంగ్రెస్ అధ్యక్షురాలు పద్మశ్రీ పైన కూడా కొందరు దాడి చేశారు. ఇంతలో మీడియా సంస్ధ సిబ్బందితో పాటు ప్రజాసంఘాలు కూడా అప్రమత్తమవటంతో కార్యకర్తలు వెళ్ళిపోయారు.