నెల్లూరు జిల్లాలో బర్డ్‌ఫ్లూ కలకలం: వందలాది కోళ్లు మృతి, అప్రమత్తమైన యంత్రాంగం

నెల్లూరు జిల్లాలో బర్డ్ ఫ్లూ  వైరస్  బయటపడింది.  ఈ వైరస్ బారిన పడిన  వందలాది కోళ్లు మృతి చెందాయి. 

Bird Flu virus found in Nellore district lns

నెల్లూరు:  ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని  పొదలకూరు, కోవూరు మండలాల్లో కోళ్లు మృతి చెందాయి. కోళ్ల మృతికి బర్డ్ ఫ్లూ కారణమని అధికారులు నిర్ధారించారు.  దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. పశుసంవర్ధక శాఖాధికారులతో  జిల్లా కలెక్టర్  చర్యలు సమావేశమయ్యారు. ముందుజాగ్రత్త చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు.

మృతి చెందిన కోళ్ల శాంపిల్స్ ను అధికారులు  బోపాల్ ల్యాబ్ కు పంపారు. మృతి చెందిన కోళ్ల లక్షణాలను పరిశీలిస్తే  బర్డ్ ఫ్లూ గా అధికారులు గా తేల్చారు.  కోళ్లు మృతి చెందిన ప్రాంతానికి  కిలోమీటరు దూరంలో ఉన్న చికెన్ దుకాణాలను మూడు మాసాల పాటు మూసివేయాలని అధికారులు ఆదేశించారు.అంతేకాదు  కోడిగుడ్లు కూడ వాడకూడదని అధికారులు తేల్చి చెప్పారు. 

also read:ముంబై ఎయిర్‌పోర్టులో విషాదం: వీల్ చైర్ లేక ప్రయాణీకుడు మృతి

రెండు తెలుగు రాష్ట్రాల్లో  గతంలో కూడ బర్డ్ ఫ్లూ  వ్యాధి సోకి వేలాది కోళ్లు మృతి చెందిన ఘటనలు లేకపోలేదు.  అయితే  తాజాగా  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు జిల్లాలో బర్డ్ ఫ్లూ వ్యాపించడంతో  అధికారులు అప్రమత్తమయ్యారు.

బర్డ్ ఫ్లూ ఇతర ప్రాంతాలకు వ్యాపించకుండా  జాగ్రత్తలు తీసుకుంటున్నారు పశుసంవర్ధక శాఖాధికారులు. బర్డ్ ఫ్లూ వ్యాధి కారణంగా  గతంలో చికెన్ ధరలు గణనీయంగా పడిపోయిన విషయం తెలిసిందే.

also read:అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి కాంగ్రెస్‌లోకి: మల్కాజిగిరి నుండి పోటీ?

బర్డ్ ఫ్లూ తో  ఉమ్మడి నెల్లూరు జిల్లాలో వందలాది కోళ్లు మృతి చెందాయి. దీంతో అధికారులు  అప్రమత్తమయ్యారు.జిల్లాలోని చాటగుట్లతో పాటు మరో గ్రామంలో కూడ  వందలాది కోళ్లు మృతి చెందాయి.ఈ విషయమై కోళ్ల ఫారాల యజమానుల నుండి అందిన ఫిర్యాదు మేరకు  పశుసంవర్ధక శాఖాధికారులు  మృతి చెందిన కోళ్ల శాంపిల్స్ ను సేకరించి  భోపాల్ ల్యాబ్ కు పంపారు.ఈ ల్యాబ్ రిపోర్టు  నిన్న అధికారులకు  చేరింది. 

also read:ఆపరేషన్‌ ఆకర్ష్‌: పార్లమెంట్ ఎన్నికలకు తెలంగాణ కాంగ్రెస్ ప్లాన్ ఇదీ...

బర్డ్ ఫ్లూ కోళ్ల నుండి మనుషులకు కూడ సోకే ప్రమాదం ఉంది. దీంతో  అధికారులు చర్యలను ప్రారంభించారు.  వ్యాధి సోకిన ప్రాంతం నుండి కోళ్లను ఇతర ప్రాంతాలకు తీసుకెళ్లకుండా పశుసంవర్ధక శాఖాధికారులు జాగ్రత్తలు తీసుకున్నారు. మరో వైపు ఇతర ప్రాంతాల నుండి  వ్యాధి సోకిన ప్రాంతానికి కూడ కోళ్లు రాకుండా చర్యలు చేపట్టారు.


 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios