Asianet News TeluguAsianet News Telugu

బీహార్ సిఎం నితీష్ రాజీనామ

  • సంక్షోభం ముదిరిపోవటంతో నితీష్ ముఖ్యమంత్రిగా తప్పుకోవాలని నిర్ణయించారు.
  • నీతి, నిజాయితీ పాలన అందించాలని అనుకున్న తర్వాత లాలూ కుమారులతో కలిసి పనిచేయటం సాధ్యంకాదని తేలిపోవటంతోనే రాజీనామ చేసినట్లు స్వయంగా నితీషే ప్రకటించారు.
Bihar cm nitish resigns

బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ బుధవారం మధ్యాహ్నం రాజీనామా చేసారు. మాజీ ముఖ్యమంత్రి, ఆర్జెడి పార్టీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబసభ్యులపై సిబిఐ దాడులు చేయటం, కేసులు నమోదు కావటం తదితరాల నేపధ్యంలో నితీష్-లాలూ మధ్య అగాధం ఏర్పడింది. కేసులు నమోదు కావటంతో లాలూ కుమారులను నితీష్ వివరణ కోరారు.

దాంతో ఇద్దరి మద్య విభేదాలు తీవ్రస్ధాయికి చేరుకున్నాయి. లాలూ కుమారుడు, ఉపముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్ వివరణ ఇవ్వాల్సిందేనంటూ నితీష్ పట్టుపట్టారు. అదే సమయంలో లాలూ కూడా తన కుమారుడు ఏ తప్పు చేయలేదు కాబట్టి ఎవరికీ వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదని లాలూ కూడా పట్టుపట్టికూర్చున్నారు. ఒకదశలో లాలూ నితీష్ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంటారని కూడా ప్రచారం జరిగింది. .

ఇటువంటి నేపధ్యం లోనే సంక్షోభం ముదిరిపోవటంతో నితీష్ ముఖ్యమంత్రిగా తప్పుకోవాలని నిర్ణయించారు. లాలూతో కలిసి పనిచేయటం సాధ్యం కాదని నితీష్ తీసుకున్న నిర్ణయంతో జాతీయ స్ధాయిలో కూడా రాజకీయ సమీకరణలు శరవేగంగా మారిపోనున్నాయి. నీతి, నిజాయితీ పాలన అందించాలని అనుకున్న తర్వాత లాలూ కుమారులతో కలిసి పనిచేయటం సాధ్యంకాదని తేలిపోవటంతోనే రాజీనామ చేసినట్లు స్వయంగా నితీషే ప్రకటించారు.

ప్రధాని అభినందనలు

అవినీతికి వ్యతిరేకంగా జరుగుతున్నపోరాటంలో నితీష్ ఇపుడు బాగస్వామి  అయినట్లు బీహార్ మాజీ ముఖ్యమంత్రికి అభినందనలు తెలిపారు

Follow Us:
Download App:
  • android
  • ios