వెంకన్నతో పెట్టుకున్న కొద్ది రేజులకే...: చంద్రబాబుకు భూమన హెచ్చరిక

వెంకన్నతో పెట్టుకున్న కొద్ది రేజులకే...: చంద్రబాబుకు భూమన హెచ్చరిక

హైదరాబాద్: వెంకన్నతో పెట్టుకున్న కొద్ది రోజులకే అలిపిరి ఘటన జరిగిందని వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడు భూమన కరుణాకర్ రెడ్డి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని హెచ్చరించారు. శ్రీవారి ఆలయానికి భూతం చంద్రబాబేనని ఆయన గురువారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు .

తన  స్వార్థ ప్రయోజనాల కోసం చంద్రబాబు నాయుడు తిరుమల శ్రీవారిని వాడుకుంటున్నారని ఆయన అన్నారు. శ్రీవారి ఆలయంలో ఎప్పుడూ జరగని ఘోరాలు జరుగుతున్నాయని అర్చకులు ఆరోపిస్తున్నారని ఆయన అన్నారు. 

ఆలయ ప్రధానార్చకుడు రమణదీక్షితులు ఆరోపణలకు టీటీడీ సమాధానం చెప్పడం లేదని, తప్పును ప్రశ్నించిన రమణ దీక్షితులుపై చర్యలు ఎంత వరకు సమంజసమని అన్నారు. ఆలయాలను కూల్చేసిన ఘోర గజినీ చంద్రబాబు అని ఆయన అన్నారు. 

ఏళ్ల నుంచి పూజలు చేసేవారిపై రెండేళ్లు అధికారంలో ఉండేవారు ఏళ్ల తరబడిగా పూజలు చేస్తున్నవారిపై చర్యలు తీసుకుంటారా అని ప్రశ్నించారు అర్చకులకపై పెత్తనం చెలాయించే అధికారం చంద్రబాబుకు లేదని, కలియుగ వైకుంఠాన్ని నరకంగా మారుస్తు్న చరిత్ర చంద్రబాబుదని అన్నారు. 

చంద్రబాబు పాలనలో విజయవాడ చుట్టూ ఉన్న 45 దేవాలయాలను కూల్చేశారని,  చంద్రబాబు తన ఉక్కు పాదాన్ని బ్రాహ్మణులపై మోపుతున్నారని ఆయన విమర్శించారు. విజయవాడ దుర్గ గుడిలో జరిగనటువంటి పూజలే తిరుమలలో జరుగుతున్నాయని అన్నారు. చంద్రబాబు పాలన అవినీతి, నేరాలు, ఘోరాలతో సాగుతోందని అన్నారు. 

ఆలయ భూములను చౌకగా కొట్టేసిన ఘనత చంద్రబాబుదని అన్నారు. అర్చక వ్యవస్థలో తలదూర్చి హిందూ సంప్రదాయాల పట్ల చంద్రబాబు ఘోరం చేస్తున్నారని అన్నారు. చంద్రబాబు హయాంలోనే 1000 కాళ్ల మండపాన్ని కూల్చేశారని, వారసత్వాలపైనా సంప్రదాయాలపైనా దాడి సరి కాదని భూమన అన్నారు.

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos

MORE FROM Andhra Pradesh

Next page