హైదరాబాద్:మాజీ మంత్రి భూమా అఖిలప్రియపై ఆమె సోదరుడు జగత్‌విఖ్యాత్ రెడ్డి రంగారెడ్డి జిల్లా కోర్టులో కేసు వేశాడు. హైద్రాబాద్‌ శివార్లలో ఉన్న భూమి విక్రయానికి సంబంధించి తనకు వాటా ఇవ్వాలని అక్కపై జగత్ విఖ్యాత్ రెడ్డి  కేసు దాఖలు చేశారు.

హైద్రాబాద్ శివార్లలో భూమా నాగిరెడ్డికి సుమారు వెయ్యి గజాల భూమి ఉంది. రాజేంద్రనగర్ మండలం గండిపేట గ్రామంలో  190, 192 సర్వే నెంబర్‌లలోని వెయ్యి గజాల భూమిని  2016లో విక్రయించారు. 

Also read:భూమా అఖిలప్రియను ఆకాశానికెత్తిన చంద్రబాబు

ఆ సమయంలో  సుమారు రూ. 2 కోట్లను ఈ భూమిని విక్రయించినట్టుగా ప్రచారం సాగుతోంది.ఈ భూమి విక్రయ సమయంలో భూమా నాగిరెడ్డితో పాటు భూమా అఖిలప్రియ, భూమా మౌనికారెడ్డితో  పాటు భూమా జగత్ విఖ్యాత్ రెడ్డి కూడ సంతకాలు పెట్టారు.

Also read:20 మంది టీడీపీ, వైసీపీ ప్రజాప్రతినిధులు టచ్‌లో: సుజనా సంచలనం

ఆ సమయంలో భూమా జగత్ విఖ్యాత్ రెడ్డి మైనర్. తనకు మైనార్టీ తీరింది. ఈ భూమి విక్రయ సమయంలో  జగత్ విఖ్యాత్ రెడ్డి తాను కేవలం వేలిముద్రలు వేసినట్టుగా జగత్ విఖ్యాత్ రెడ్డి చెబుతున్నారు.ఈ భూమి విక్రయానికి సంబంధించి తనకు వాటా ఇవ్వాలని కోరుతూ భూమా జగత్ విఖ్యాత్ రెడ్డి ఈ నెల 14వ తేదీన రంగారెడ్డి జిల్లా అడిషనల్ కోర్టులో కేసు వేశాడు.

ఈ భూమి విక్రయానికి సంబంధించి ఆ సమయంలో భూమా కుటుంబ సభ్యులు ఏ చిరునామాను ఇచ్చారో అదే చిరునామాను జగత్ విఖ్యాత్ రెడ్డి కూడ ఇచ్చాడు. ఈ కేసును దాఖలు చేసిన న్యాయవాది భూమా అఖిలప్రియకు సమీప బంధువు అని చెబుతున్నారు.

అయితే  ఈ కేసుపై కోర్టు ఏం చెబుతోందనే విషయమై సర్వాత్ర ఉత్కంఠ నెలకొంది.   వాస్తవానికి ఈ భూమి దివంగత భూమా శోభా నాగిరెడ్డి పేరున ఉంది. అయితే శోభా నాగిరెడ్డి పేరున ఉన్న ఈ భూమిని భూమా నాగిరెడ్డి  2016లో విక్రయించాడు.

ఈ ఏడాది ఏప్రిల్ మాసంలో జరిగిన ఎన్నికల్లో ఆళ్లగడ్డ నుండి టీడీపీ అభ్యర్ధిగా పోటీ చేసిన భూమా అఖిలప్రియ పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఓటమి తర్వాత వరుసగా ఆమె చుట్టూ వివాదాలను ఎదుర్కొంటున్నారు.

ఓ క్రషర్ వివాదంలో అఖిలప్రియ భర్త భార్గవ్ రామ్ పై కేసు నమోదైంది. ఆయనను అరెస్ట్ చేసేందుకు వచ్చిన పోలీసులపై భార్గవ్ రామ్ దురుసుగా ప్రవర్తించారనే ఆయనపై కేసు నమోదైంది. ప్రస్తుతం ఆయన పరారీలో ఉన్నారని పోలీసులు చెబుతున్నారు. తాజాగా సోదరుడే అఖిలప్రియపై కేసు వేయడం ప్రస్తుతం చర్చకు దారితీస్తోంది.