బీరు సీసాల లోడ్ తో వెళ్తున్న లారీ ప్రమాదానికి గురైంది. ఈ క్రమంలో లారీ పూర్తిగా ధ్వంసమవ్వగా... బీరు ఆవిరైపోయింది. ఈ సంఘటన కర్నూలు జిల్లాలో చోటుచేసుకుది. బీరు సీసాల లోడ్ తో లారీ రోడ్డుపై వెళ్తుండగా సాంకేతిక లోపంతో లారీ ఇంజిన్‌లో మంటలు చెలరేగాయి. 

ఎగిసిపడుతున్న మంటలకు బీరు సీసాలు పేలిపోయాయి.మద్యం బాటిళ్లు పగలడంతో డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి. అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు