రాకీయాకి షాక్ : లండన్ కోర్టులో ఏపీ ప్రభుత్వం విజయం


రస్ అల్ ఖైమా సంస్థకు లండన్ అర్బిట్రేషన్ కోర్టులో చుక్కెదురైంది. రాకీయా సంస్థ దాఖలు చేసిన పిటిషన్ ను లండన్ అర్బిట్రేషన్ కోర్టు కొట్టివేసింది. ఏపీ ప్రభుత్వ వాదనలను లండన్ అర్బిట్రేషన్ కోర్టు ఏకీభవించింది. 

Bauxite mining dispute IDRC dismisses UAE bodys claim for damages from Andhra govt

అమరావతి: విశాఖపట్టణం ఏజెన్సీలో  Bauxite ఒప్పందాలపై ఏర్పడిన వివాదంపై అండన్ అర్బిట్రేషన్ కోర్టులో యూఏఈకి చెందిన రస్ ఆల్ ఖైమా ఇన్వెస్ట్ మెంట్ అథారిటీ వేసిన కేసులో ఏపీ ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వచ్చింది. 

భారత్ తరపున ఏపీ ప్రభుత్వం విన్పించిన వాదనలతో   London  అర్బిట్రేషన్ కోర్టు ఏకీభవించింది. ఈ కేసు తమ పరిధిలోకి రాదంటూ కేసు కొట్టేసింది. ఏళ్ల తరబడి పెండింగ్ లో ఉన్న ఈ కేసును లండన్ అర్బిట్రేషన్ కోర్టు కొట్టివేయడంతో ఏపీ ప్రభుత్వానికి ఊరట దక్కింది.

2007లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నం జిల్లాలో ఉన్న బాక్సైట్ ను వినియోగించుకుని అల్యూమినియం పరిశ్రమను ఏర్పాటు చేసేందుకు రస్ అల్ ఖైమా ఇన్వెస్ట్ మెంట్ (రాకీయా) తో అప్పటి రాష్ట్రప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. 

ఇందుకు గానూ RAKIA తన జాయింట్ వెంచర్ సంస్థ ఎన్ రాక్ ద్వారా ఏర్పాటు చేసే అల్యూమినియం పరిశ్రమకు ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ APMDC  ద్వారా బాక్సైట్ సరఫరా చేసేట్టుగా ఒప్పందం కుదిరింది. అయితే విశాఖ ఏజెన్సీ ప్రాంతంలో బాక్సైట్ తవ్వకాల వల్ల గిరిజన సంస్కృతికి విఘాతం ఏర్పడుతుందని స్థానికుల నుంచి ఆందోళనలు వ్యక్తమయ్యాయి. 

ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం బాక్సైట్ సరఫరా ఒప్పందాన్ని రద్దు చేసింది. ఈ పరిశ్రమను మావోయిస్టులు తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ పరిశ్రమ ఏర్పాటు చేస్తే తీవ్ర పరిణమాలను ఎదుర్కోవాల్సి వస్తుందని స్థానిక ప్రజా ప్రతినిధులను అప్పట్లో హెచ్చరించారు. అంతేకాదు గిరిజన సంఘాలు కూడా ఆందోళనలు నిర్వహించాయి.దీంతో ఈ విషయమై ప్రభుత్వం ముందుకు వెళ్లలేకపోయింది. 

దీంతో  INDIA, UAEల మధ్య ఉన్న బిఐటి ఒప్పందాన్ని  ఆసరాగా చేసుకుని రాకియా సంస్థ తమకు బాక్సైట్ సరఫరా చేయపోవడం వల్ల నష్టపోయామంటూ లండన్ Arbitration కోర్ట్ లో కేసు వేసింది. 

Andhra Pradesh ప్రభుత్వం ఒప్పందం ప్రకారం తమకు బాక్సైట్ ఇవ్వకపోవడం వల్ల తాము అల్యూమినియం పరిశ్రమ కోసం పెట్టిన పెట్టుబడులకు నష్టం కలిగిందన్నారు. అందుకు గానూ తమకు నష్టపరిహారం ఇవ్వాలంటూ రాకీయా సంస్థ లండన్ ఆర్బిట్రేషన్ కోర్ట్ లో వాదనలు వినిపించింది. ఈ కేసులో దాదాపు 273 మిలియన్ డాలర్లు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేసింది.

also read:మన్యంలో బాక్సైట్ తవ్వకాలు: అన్‌రాక్‌తో వివాదం పరిష్కారం దిశగా ఏపీ

మధ్యవర్తిత్వం ద్వారా ఈ కేసును పరిష్కరించుకునేందుకు ఏపీ ప్రభుత్వం ప్రయత్నించింది. పలుసార్లు ప్రభుత్వం తరుఫున ప్రతినిధులు రాకియాతో సంప్రదింపులు జరిపినా అంగీకరించలేదు. ఈ క్రమంలో సీఎం జగన్ సూచనలతో అధికారులు పకడ్భందీగా లండన్ ఆర్బిట్రేషన్ కోర్టులో తమ వాదనలను వినిపించారు. ఏపీ ప్రభుత్వం నుంచి గనులశాఖ ఉన్నతాధికారులు, ఎపిఎండిసి అధికారులు, న్యాయనిపుణులు లండన్ కోర్ట్ లో బాక్సైట్ ఒప్పందాల రద్దు పర్యవసానాలను బలంగా వినిపించారు.

దీంతో లండన్ న్యాయస్థానం ఎపి ప్రభుత్వం తరుఫున ప్రతినిధులు వినిపించిన వాదనలతో ఏకీభవించింది., ఈ కేసు తమ పరిధిలోకి రాదని కేసు కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios