విశాఖ మన్యంలో బాక్సైట్ తవ్వకాలపై ఏపీ సర్కార్‌లో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. అన్‌రాక్‌తో వున్న వివాదానికి పరిష్కారం కనుగొనే పనిలో ఏపీ ప్రభుత్వం వుంది. బాక్సైట్ తవ్వకాలు జరపకుండా వివాదాన్ని పరిష్కరించేందుకు కసరత్తు చేస్తోంది.

ఎట్టి పరిస్ధితుల్లోనూ బాక్సైట్ తవ్వకాలు జరిపేదే లేదని సర్కార్ స్పష్టం చేసింది. అన్‌రాక్ వివాద పరిష్కారానికి ప్రత్యామ్నాయాలపై సమాలోచనలు జరుపుతోంది. అన్‌రాక్‌కు వేరే రాష్ట్రంలోని బాక్సైట్ గనులను అప్పగించేందుకు ఏపీ ప్రభుత్వం కేంద్రాన్ని కోరుతోంది.

ఇప్పటికే కేంద్ర గనుల మంత్రిత్వశాఖతో ఏపీ అధికారులు  సంప్రదింపులు జరుపుతున్నారు. అన్‌రాక్‌లో రకియా వాటాలను ప్రభుత్వమే కొనుగోలు చేసే అంశంపైనా చర్చిస్తోంది.

రకియా వాటా కొనుగోలుకు అవసరమయ్యే నిధులపైనా సమాలోచనలు చేస్తోంది. ప్రస్తుతం అన్‌రాక్ రిఫైనరీ ప్రాజెక్ట్ పనికిరాకుండా ఉండటంతో వాటాల కొనుగోలులో నష్టమేనని అధికారులు భావిస్తున్నారు.