బాపట్ల జిల్లా పర్చూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆటోలో ప్రయాణిస్తున్న మహిళలపై అత్యాచారానికి పాల్పడిన నిందితునికి ఒంగోలు అడిషనల్ జిల్లా కోర్ట్ కఠిన శిక్షను విధించింది.
అత్యాచారం కేసులో ఒంగోల్ అడిషనల్ జిల్లా కోర్టు సంచలన తీర్పు వెలువర్చింది. బాపట్ల జిల్లా పర్చూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆటోలో ప్రయాణిస్తున్న మహిళలపై అత్యాచారానికి పాల్పడిన నిందితునికి జిల్లా కోర్ట్ కఠిన శిక్షను విధించింది. నిందితుడికి 13 ఏళ్ల శిక్షతో పాటు 4 వేల జరిమానా విధిస్తూ.. సంచలన తీర్పును వెలువర్చింది.
వివరాల్లోకెళితే.. 2021 జులై 12 తేదీన సాయంత్రం 6 గంటల ప్రాంతంలో అడుసుమల్లి నుండి పర్చూరుకు వెళ్లాడానికి ఓ మహిళ ఆటోలో ఎక్కింది. అయితే.. అందులో ఒకే మహిళ ఉండడంతో ఆటో డ్రైవర్ తన కీచక బుద్ధిని చూపించాడు.ఈ క్రమంలో ఆటోను దేవరపల్లి గ్రామ పొలాల్లోకి తీసుకెళ్లి మహిళను బెదిరించాడు.
ఆమెపై లైంగిక దాడి చేశాడు. బాధితురాలు ఎట్టకేలకు అతని నుండి తప్పించుకొని పర్చూర్ పోలీసులకు ఆశ్రయించింది. పోలీసు స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడైన ఆటో డ్రైవర్ పిల్లి నాగేంద్రబాబు అలియాస్ మోజెస్ ను అరెస్టు చేశారు. తమదైన శైలిలో విచారించగా నిందితుడు తన నేరాన్ని అంగీకరించాడు. అనంతరం జైలుకు పంపించారు. జిల్లా కోర్ట్ నిందితుడికి 13 ఏళ్ల శిక్ష తో పాటు నాలుగు వేల జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చింది.
ఈ కేసు విషయంలో ఎస్సై వకుల్ జిందాల్ మాట్లాడుతూ.. పోలీసులను ఉన్నతాధికారులను అభినందించారు. రాజేంద్రనాథ్ రెడ్డి మహిళల సంబంధిత నేరాలలో నిందితులకు శిక్ష పడేలా సంబంధిత కేసులలో పోలీసులు అధికారులు ఎప్పటికప్పుడు ట్రయల్ మానిటరింగ్ నిర్వహిస్తున్నారని తెలిపారు. ఈ ట్రయల్ మానిటరింగ్ సత్ఫలితాలను ఇస్తుందని పేర్కొన్నారు. పోలీసుల స్వయంగా కోర్టు ట్రయలను పర్యవేక్షించడం వలన గతంలో పోలిస్తే.. ప్రస్తుతం కోర్టులో విధించే శిక్షల శాతం పెరిగిందన్నారు.
