పేరుకి అతనో బ్యాంక్ మేనేజర్. అందరి ముందూ ఉన్నతంగా కనిపించే అతనిలో ఓ రాక్షసుడు దాక్కొని ఉన్నాడన్న విషయం చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కట్టుకున్న భార్యను అతి క్రూరంగా హత్య చేశాడు. 

అదనపు కట్నం కోసం కొంత కాలం భార్యను వేధించడమే కాకుండా..తనకు ఉన్న వివాహేతర సంబంధాలకు భార్య అడ్డుగా ఉందని భావించాడు. ఆమె తెలియకుండా సైనెడ్ కలిపిన మందులు మింగించి ప్రాణాలు కోల్పోయేలా చేశాడు. బయటకు మాత్రం సహజమరణంలా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. ఈ సంఘటన చిత్తూరులో చోటుచేసుకుంది.

Also read సేవ్ అమరావతి: పెళ్లి పత్రికపై సురేష్ వినూత్న ప్రచారం...

పూర్తి వివరాల్లోకి వెళితే... చిత్తూరు జిల్లా మదనపల్లెకు చెందిన రవిచైతన్య అనే వ్యక్తి బ్యాంకులో మేనేజర్ గా పనిచేస్తున్నాడు.  అతనికి కొంతకాలానికి చెందిన ఆమని అనే యువతితో వివాహమైంది. పెళ్లి సమయంలో రూ.15లక్షలు, 150 తులాల బంగారం, ఎకరం పొలం కట్నంగా ఇచ్చి ఘనంగా వివాహం జరిపించారు.

అయితే... ఇటీవల ఆమని సోదరికి వివాహం జరిగింది. ఆమెకు కట్నం కింద రెండు ఎకరాల పొలం ఇచ్చారు. తనకు మాత్రం ఎకరం పొలమే ఇచ్చారని... రెండో అల్లుడికి మాత్రం రెండు ఎకరాలు ఇచ్చారంటూ రవి చైతన్య నానా గొడవ చేశాడు. తనకు అదనపు కట్నం కావాలంటూ భార్య, అత్తమామలను వేధించాడు.

ఇదిలా ఉండగా... రవి చైతన్యకు చాలా మంది మహిళలలో వివాహేతర సంబంధాలు ఉన్నాయి. ఈ క్రమంలో... వీటన్నింటికీ భార్య ఆమని అడ్డుగా అనిపించింది. దీంతో ఎలాగైనా భార్యను వదిలించుకోవాలని అనుకున్నాడు. ఆమె రోజూ వేసుకునే బీ కాంప్లెక్స్ ట్యాబ్లెట్లలో సైనేడ్ కలిపాడు.

అది తెలీక ఆమె వాటిని మింగడంతో ప్రాణాలు వదిలింది. ఏమీ తెలియనట్లుగా బాత్రూమ్ లో జారి కిందపడిపోయిందని చెప్పి ఆస్పత్రికి తీసుకువెళ్లారు. అనుమానం వచ్చిన వైద్యులు పోస్ట్ మార్టం చేయగా... అసలు విషయం తెలిసింది. దీంతో హాస్పిటల్ లోని వైద్యులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.

వారు ఆమె భర్త, అత్తమామలను అదుపులోకి తీసుకొని విచారించగా.. అసలు నిజం అంగీకరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అరెస్టు చేశారు. నిందితులకు సైనేడ్ సరఫరా చేసిన వారిపై కూడా చర్యలు తీసుకుంటామని పోలీసులు చెప్పారు.