ఓ ఇంటి వద్ద ఆగి బయలుదేరినపుడు తనకన్నా ముందు ఓ అభిమాని వెళ్ళటాన్ని బాలయ్య సహించలేకపోయారు. దాంతో వెంటనే అభిమాని చెంప ఛెళ్ళుమనిపించారు.

నందమూరి నటసింహం బాలకృష్ణ మరోసారి అభిమానిని కొట్టారు. మంగళవారం హిందుపురం నియోజకవర్గంలో జరిగిన ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో భాగంగా స్ధానిక నేతలతో పాటు బాలకృష్ణ కూడా పాల్గొన్నారు. అయితే, ఓ ఇంటి వద్ద ఆగి బయలుదేరినపుడు తనకన్నా ముందు ఓ అభిమాని వెళ్ళటాన్ని బాలయ్య సహించలేకపోయారు. దాంతో వెంటనే అభిమాని చెంప ఛెళ్ళుమనిపించారు. అయితే స్ధానిక నేతలు సదరు అభిమానిని సముదాయించి పక్కకు పంపేసారు. అభిమానులపై బాలయ్య దురుసుగా ప్రవర్తించటం ఇదే మొదటిసారి కాదు. ఇటీవలే నంద్యాల ఉపఎన్నికలో కూడా పూలదండ వేయటానికి ముందుకు వచ్చిన అభిమానిని కూడా బాలయ్య ఇదే విధంగా కొట్టారు. సినిమా ప్రమోషన్ల విషయంలో కూడా ఎంతోమంది అభిమానులను బాలకృష్ణ కొట్టిన సంగతి అందరూ చూసిందే.