విశాఖపట్టణం: విశాఖ ఏజేన్సీలో  వన్యప్రాణుల కోసం వేటగాళ్లు జరిపిన కాల్పుల్లో ఓ  వ్యక్తి మరణించాడు.విశాఖ ఏజెన్సీ ప్రాంతంలో వన్యప్రాణుల కోసం వేటగాళ్లు ఉచ్చులు ఏర్పాటు చేసేవారు. కొన్ని సమయాల్లో కొందరు తుపాకులతో వేటాడిన ఘటనలు కూడ ఉన్నాయి.

గురువారం నాడు  వన్యప్రాణుల కోసం వేటగాళ్లు నాటు తుపాకీతో కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో  బలరాం అనే వ్యక్తి మరణించాడు.ఈ విషయమై బాధిత కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది.ఈ ఫిర్యాదుపై పోలీసులు  కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

వన్యప్రాణుల వేటను ఎవరెవరు చేస్తున్నారు, ఎంతకాలం నుండి చేస్తున్నారనే విషయమై పోలీసులు ఆరా తీస్తున్నారు. మరో వైపు నాటు తుపాకీ వేటగాళ్లకు ఎక్కడి నుండి వచ్చిందనే విషయమై కూడ ఆరా తీస్తున్నారు.

ఈ తుపాకీని వేటగాళ్లు ఎక్కడి నుండి తీసుకొచ్చారు, గతంలో కూడ ఈ తరహా ఘటనల్లో వీరి పాత్ర ఏమైనా ఉందా తదితర విషయాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ ఘటనలో మరణించిన బలరాం కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

అక్రమంగా వేళ్తున్న