ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారికి హిందూపురం ఎమ్మెల్యే, టీడీపీ నేత, నటుడు బాలకృష్ణ లేఖ రాసారు. హిందూపురానికి మెడికల్ కాలేజీ మంజూరు చేయడంపై ఆయన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. 

హిందూపురంలో మెడికల్ కాలేజీ ఏర్పాటు వల్ల స్థానికులకు, యావత్ రాయలసీమ ప్రాంతానికే ఇది లాభదాయకమని అన్నారు బాలయ్య. హిందూపురంలో మెడికల్ కాలేజీ ఏర్పాటుకు అవసరమైనన్ని భూములు హిందూపురంలో ఉన్నాయని  బాలకృష్ణ. 

మలుగూరు గ్రాంలో రెవిన్యూ అధికారులు దాదాపుగా 52 ఎకరాల  గుర్తించారని, ఆ ప్రాంతానికి దగ్గర్లోనే అనేక విద్యాసంస్థలు కూడా ఉన్నాయని, ఆ ప్రాంతంలో మెడికల్ కాలేజీని ఏర్పాటు చేయాలనీ లేఖలో బాలకృష్ణ కోరారు. 

ఇక మరో లేఖలో జిల్లాల పునర్విభజన గురించి ప్రస్తావిస్తూ... ఒక వేళ జిల్లాల పునర్విభజన గనుక జరిగితే.... హిందూపురాన్ని ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేయాలనీ కోరారు. ఈమేరకు ఆయన ముఖ్యమంత్రికి చీఫ్ సెక్రటరీ కి ఆరోగ్య మంత్రికి లేఖలను ఫేస్ ద్వారా పంపించారు. 

ఇకపోతే.... ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తలస్తున్న జిల్లాల ఏర్పాటు ఆయనకు తలనొప్పులు తెచ్చిపెట్టే విధంగా కనబడుతుంది. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు కొత్త జిల్లాలను ఏర్పాటు చేసేందుకు  ఏర్పాట్లు చేయాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు.ఇటీవల జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు.

ప్రతి పార్లమెంట్ నియోజకవర్గ కేంద్రాన్ని కొత్త జిల్లాగా ఏర్పాటు చేస్తామని జగన్ ఎన్నికల సమయంలో  జగన్ హామీ ఇచ్చారు. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ రాష్ట్రం కొత్త జిల్లాలను ఏర్పాటు చేసింది. తెలంగాణలో తొలుత ఉన్న 10 జిల్లాలను 33 జిల్లాలుగా విభజించింది ఆ ప్రభుత్వం. తెలంగాణ బాటలోనే ఏపీ ప్రభుత్వం కూడ కొత్త జిల్లాలను ఏర్పాటు చేయనుంది.

also read:తెలంగాణ బాటలోనే ఏపీ: మరో 12 జిల్లాల ఏర్పాటుకు సర్కార్ కసరత్తు
కొత్త జిల్లాల ఏర్పాటు విషయంలో క్షేత్రస్థాయిలో ప్రజలు కొత్త డిమాండ్లను లేవనెత్తుతున్నారు. తమ ప్రాంత ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా కొత్త జిల్లాలను ఏర్పాటు చేయాలని  ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

కొత్త జిల్లాల విషయంలో ప్రజా ప్రతినిధులు, పార్టీలు కూడ తమ డిమాండ్లను ప్రభుత్వం ముందుకు తీసుకొస్తున్నాయి.  మదనపల్లిని కూడ జిల్లా చేయాలనే డిమాండ్ నెలకొంది.

తాజాగా మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు కూడ కొత్త జిల్లాల విషయంలో కీలక వ్యాఖ్యలు చేశారు. జిల్లాల విభజన అశాస్త్రీయంగా జరిగితే శ్రీకాకుళం జిల్లా అభివృద్ధి శూన్యంగా మారనుందని బుధవారం నాడు వ్యాఖ్యానించారు.