Asianet News TeluguAsianet News Telugu

తెలంగాణ బాటలోనే ఏపీ: మరో 12 జిల్లాల ఏర్పాటుకు సర్కార్ కసరత్తు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న జిల్లాలకు అదనంగా మరికొన్ని జిల్లాలను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఒక జిల్లా చేసే ఆలోచన ఉందని సీఎం ప్రకటించారు.

Andhra pradesh government plans to set up another 12 districts in state
Author
Amaravathi, First Published Jun 23, 2020, 5:17 PM IST


అమరావతి:ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న జిల్లాలకు అదనంగా మరికొన్ని జిల్లాలను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఒక జిల్లా చేసే ఆలోచన ఉందని సీఎం ప్రకటించారు.

ఎన్నికల సమయంలో ఇదే విషయాన్ని జగన్ ప్రజలకు హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ సమావేశంలో  సీఎం కొత్త జిల్లాల ఏర్పాటు విషయాన్ని ప్రస్తావించారు.

ప్రతి పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా ఏర్పాటు చేసే ఆలోచన ఉందని ఈ సమావేశంలో సీఎం చెప్పారు. కొత్త జిల్లాల ఏర్పాటు విషయమై అధికార యంత్రాంగం కసరత్తు నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తోంది. 

రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ రాష్ట్రం కూడ జిల్లాల పునర్వవ్యస్థీకరించింది. రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణలో 10 జిల్లాలు ఉన్నాయి. ప్రస్తుతం తెలంగాణలో జిల్లాల సంఖ్య 33కి చేరుకొన్నాయి.

ఇక ఏపీ రాష్ట్రంలో కూడ జిల్లాలను పెంచాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. ఏపీ ప్రభుత్వం మాత్రం పార్లమెంట్ నియోజకవర్గానికో కొత్త జిల్లాను ఏర్పాటు చేయాలని ప్లాన్ చేస్తోంది.

కొత్త జిల్లాల ప్రతిపాదనలు ఇలా ఉన్నాయి....

1) అరకు జిల్లా పరిధిలోకి వచ్చే ప్రాంతాలు
130. కురుపాం 
131. పార్వతీపురం
132. సాలూరు
146. మాడుగుల,
147. అరకు లోయ 
148. పాడేరు
172. రంపచోడవరం 

2) శ్రీకాకుళం జిల్లా
120. ఇచ్ఛాపురం,
121. పలాస,
122. టెక్కలి,
123. పాతపట్నం,
124. శ్రీకాకుళం,
125. ఆముదాలవలస
127. నరసన్నపేట.

3) విజయనగరం జిల్లా
126. ఎచ్చెర్ల,
128. రాజాం 
129. పాలకొండ హ
133. బొబ్బిలి,
134. చీపురుపల్లి,
136. భోగాపురం
137. విజయనగరం.

4) విశాఖపట్నం జిల్లా
135. గజపతినగరం,
138. శృంగవరపుకోట,
139. భీమిలి,
140.తూర్పు విశాఖపట్నం,
141. దక్షిణ విశాఖపట్నం,
142. ఉత్తర విశాఖపట్నం,
143. పశ్చిమ విశాఖపట్నం

5) అనకాపల్లి  జిల్లా
144. గాజువాక,
145. చోడవరం,
149. అనకాపల్లి,
150. పెందుర్తి,
151. ఎలమంచిలి,
152. పయకరావుపేట
153. నర్సీపట్నం.

6) కాకినాడ జిల్లా
154. తుని,
155. ప్రత్తిపాడు,
156. పిఠాపురం,
157. కాకినాడ గ్రామీణ,
158. పెద్దాపురం,
160. కాకినాడ సిటీ,
171. జగ్గంపేట.

7) అమలాపురం జిల్లా 
161. రామచంద్రాపురం,
162. ముమ్మడివరం,
163. అమలాపురం
164. రాజోలు
165. గన్నవరం
166. కొత్తపేట,
167. మండపేట

8) రాజమండ్రి జిల్లా
159. అనపర్తి,
168. రాజానగరం,
169. రాజమండ్రి సిటీ,
170. రాజమండ్రి గ్రామీణ,
173. కొవ్వూరు
174. నిడదవోలు,
185. గోపాలపురం 

9) నరసాపురం జిల్లా
175. ఆచంట,
176. పాలకొల్లు,
177. నర్సాపురం,
178. భీమవరం,
179. ఉండి,
180. తణుకు,
181. తాడేపల్లిగూడెం.

10) ఏలూరు జిల్లా
182. ఉంగుటూరు,
183. దెందులూరు,
184. ఏలూరు,
186. పోలవరం 
187. చింతలపూడి
189. నూజివీడు
192. కైకలూరు

11) మచిలీపట్టణం జిల్లా
190. గన్నవరం,
191. గుడివాడ,
193. పెడన,
194. మచిలీపట్నం,
195. అవనిగడ్డ,
196. ఉయ్యూరు,
197. పెనమలూరు

12) విజయవాడ జిల్లా
188. తిరువూరు
198. భవానీపురం,
199. సత్యనారాయణ పురం,
200. విజయవాడ పడమట,
201. మైలవరం,
202. నందిగామ
203. జగ్గయ్యపేట

13) గుంటూరు జిల్లా
205. తాడికొండ
206. మంగళగిరి,
207. పొన్నూరు,
210. తెనాలి,
212. ప్రత్తిపాడు
213. గుంటూరు ఉత్తర,
214. గుంటూరు దక్షిణ

14 నరసారావుపేట జిల్లా
204. పెదకూరపాడు,
215. చిలకలూరిపేట,
216. నరసారావుపేట,
217. సత్తెనపల్లి,
218. వినుకొండ,
219. గురజాల,
220. మాచెర్ల

15 బాపట్ల జిల్లా
208. వేమూరు 
209. రేపల్లె,
211. బాపట్ల,
223. పరుచూరు,
224. అద్దంకి
225. చీరాల,
226. సంతనూతల (ఎస్.సి.)

16) ఒంగోలు జిల్లా
221. ఎర్రగొండపాలెం,
222. దర్శి,
227. ఒంగోలు,
229. కొండపి
230. మార్కాపురం,
231. గిద్దలూరు,
232. కనిగిరి

17) నంద్యాల జిల్లా
253. ఆళ్ళగడ్డ,
254. శ్రీశైలం,
255. నందికొట్కూరు
257. కల్లూరు,
258. నంద్యాల,
259. బనగానపల్లి,
260. డోన్

18 కర్నూలు జిల్లా
256. కర్నూలు,
261. పత్తికొండ,
262. కోడుమూరు
263. యెమ్మిగనూరు,
264. కౌతలం,
265. ఆదోని,
266. ఆలూరు

19) అనంతపురం జిల్లా
267. రాయదుర్గం,
268. ఉరవకొండ,
269. గుంతకల్లు,
270. తాడిపత్రి,
272. అనంతపురం,
273. కళ్యాణదుర్గం,
274. రాప్తాడు

20) హిందూపూర్ జిల్లా
 271. సింగనమల
275. మడకసిర
276. హిందూపురం,
277. పెనుకొండ,
278. పుట్టపర్తి,
279. ధర్మవరం,
280. కదిరి

21) కడప జిల్లా
243. బద్వేల్
245. కడప,
248. పులివెందుల,
249. కమలాపురం,
250. జమ్మలమడుగు,
251. ప్రొద్దుటూరు,
252. మైదుకూరు

22) నెల్లూరు జిల్లా
228. కందుకూరు,
233. కావలి,
234. ఆత్మకూరు,
235. కొవ్వూరు,
236. నెల్లూరు పట్టణ,
237. నెల్లూరు గ్రామీణ
242. ఉదయగిరి.
23) తిరుపతి 
238 సర్వేపల్లి,
 239. గూడూరు
240. సూళ్ళూరుపేట
241. వెంకటగిరి

286. తిరుపతి జిల్లా
287. శ్రీకాళహస్తి,
288. సత్యవేడు
24) రాజంపేట 
244. రాజంపేట
246 కోడూరు
247. రాయచోటి
281. తంబళ్ళపల్లె
282. పీలేరు
283. మదనపల్లె
284. పుంగనూరు

25. చిత్తూరు జిల్లా
285. చంద్రగిరి
289. నగరి,
290 గంగాధరనెల్లూరు
291 చిత్తూరు,
292 పూతలపట్టు
293 పలమనేరు,
294 కుప్పం.


 

Follow Us:
Download App:
  • android
  • ios