Asianet News TeluguAsianet News Telugu

ప్రభుత్వాస్పత్రిలో ఎమ్మెల్యే బాలకృష్ణ ఆకస్మిక తనిఖీలు.. వైద్యులపై ఫైర్

హిందూపురం ఎమ్మెల్యే, టీడీపీ నేత నందమూరి బాలకృష్ణ నియోజకవర్గంలోని ప్రభుత్వ హాస్పిటల్‌లో సోమవారం ఆకస్మిక తనిఖీలు చేశారు. హాస్పిటల్‌లోనే పేషెంట్లతో నేరుగా మాట్లాడారు. రోగుల ఫిర్యాదులు విన్న బాలకృష్ణ వైద్యులపై ఫైర్ అయ్యారు.
 

balakrishan surprise visit to hindupuram govt hospital
Author
Hindupuram, First Published Oct 18, 2021, 4:03 PM IST

అమరావతి: హిందూపురం ఎమ్మెల్యే, టీడీపీ నేత నందమూరి బాలకృష్ణ హిందూపురం ప్రభుత్వాస్పత్రిలో ఆకస్మిక తనిఖీలు చేశారు. Hindupuram ప్రభుత్వ హాస్పిటల్ పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. Patientలతో నేరుగా మాట్లాడారు. వారి నుంచి వైద్యులపై ఫిర్యాదులు వచ్చాయి. ప్రభుత్వ ఆస్పత్రిలో తమను వైద్యులు పట్టించుకోవడం లేదని, వారు స్వయంగా హాస్పిటల్స్‌ రన్ చేస్తున్నారని ఫిర్యాదులు చేశారు. దీంతో ఎమ్మెల్యే బాలకృష్ణ Doctorsపై ఫైర్ అయ్యారు.

వైద్యుల నిర్లక్ష్యం కారణంగా రెండు రోజుల శిశువు చనిపోయిందంటూ ఓ వ్యక్తి బాలకృష్ణకు చెప్పి కన్నీరుమున్నీరు అయ్యాడు. దీనిపై బాలకృష్ణ సీరియస్ అయ్యారు. వెంటనే హాస్పిటల్ సూపరింటెండెంట్‌ను పిలిచి వివరాలు అడిగాడు. ఇలాంటి ఘటనలు మళ్లీ రిపీట్ కావద్దని హెచ్చరించారు. హిందూపురం ప్రభుత్వ హాస్పిటల్‌లో పరిస్థితులు బాగాలేవని అన్నారు. ఈ పరిస్థితులపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తానని బాలకృష్ణ చెప్పారు.

Also Read: సీమకు కృష్ణా నికర జలాలు ఇవ్వాలి.. లేకుంటే ఢిల్లీలో పోరాటం: జగన్ సర్కార్‌కు బాలయ్య అల్టీమేటం

Balakrishna హిందూపురం ప్రభుత్వ హాస్పిటల్‌లో ఆకస్మికంగా Inspection చేయడం నియోజకవర్గం సహా రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది. హాస్పిటల్ కండీషన్స్ అధ్వాన్నంగా ఉన్నాయని బాలకృష్ణ మండిపడ్డారు. తమ ప్రభుత్వ హయాంలో ఎప్పుడూ ఇంతటి దారుణ పరిస్థితుల్లో లేవని ఫైర్ అయ్యారు. 

ప్రస్తుతం ఎమ్మెల్యే బాలకృష్ణ హిందూపురం నియోజకవర్గ పర్యటనలో ఉన్నారు. రెండో రోజు పర్యటనలో భాగంగా ఆయన హిందూపురం ప్రభుత్వ హాస్పిటల్‌కు వెళ్లారు. కరోనా సమయంలో ఆయన ప్రభుత్వ హాస్పిటల్‌కు సొంత డబ్బులతో వెంటిలేటర్లూ సమకూర్చడం గమనార్హం.

Follow Us:
Download App:
  • android
  • ios