Asianet News TeluguAsianet News Telugu

పరిషత్ ఎన్నికలు.. చంద్రబాబు కంటే.. బాలయ్యే బెటరా..?

 ఆయన బావ మరిది ఎమ్మెల్యే బాలకృష్ణ ప్రాతినిథ్యం వహిస్తున్న హిందూపురంలో మాత్రం 7 ఎంపీటీసీ స్థానాలు గెలుచుకోవడం విశేషం. బాలకృష్ణ మాత్రమే కాదు.. కొందరు సీనియర్ నేతలు కూడా తమ నియోజకవర్గాల్లో చంద్రబాబుతో పోలిస్తే మెరుగైన ఫలితాలను సాధించడం గమనార్హం.
 

Bala krishna Is far Baetter Than Chandrababu Over Muncipal Elections
Author
Hyderabad, First Published Sep 22, 2021, 8:50 AM IST

పరిషత్ ఎన్నికల్లో టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కంటే.. ఆ పార్టీ సీనియర్ నేతలు, ఆయన బావ మరిది బాలకృష్ణే బెటర్ ఫలితాలు సాధించడం గమనార్హం. ఇటీవల ఆంధ్రప్రదేశ్ లో పరిషత్ ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. కాగా.. ఈ ఎన్నికల్లో  కుప్పంలో టీడీపీ కేవలం మూడు ఎంపీటీసీ స్థానాలను మాత్రమే గెలుచుకోవడం గమనార్హం.

అయితే.. చంద్రబాబు ప్రాతినిథ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో మూడు స్థానాలు గెలిచినా.. ఆయన బావ మరిది ఎమ్మెల్యే బాలకృష్ణ ప్రాతినిథ్యం వహిస్తున్న హిందూపురంలో మాత్రం 7 ఎంపీటీసీ స్థానాలు గెలుచుకోవడం విశేషం. బాలకృష్ణ మాత్రమే కాదు.. కొందరు సీనియర్ నేతలు కూడా తమ నియోజకవర్గాల్లో చంద్రబాబుతో పోలిస్తే మెరుగైన ఫలితాలను సాధించడం గమనార్హం.

రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లోనూ టీడీపీ అభ్యర్థులు పోటీ చేశారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాల కోసం హోరాహోరీగా పోరాడినా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ముందు నిలవలేకపోయారు. 641 జెడ్పీటీసీలకు 482 చోట్ల టీడీపీ అభ్యర్థులు పోటీ చేశారు. గెలిచింది మాత్రం ఆరు జెడ్పీటీసీ స్థానాల్లోనే. అలాగే 6,558 ఎంపీటీసీ స్థానాల్లో పోటీ చేసి 930 చోట్ల నెగ్గారు. కుప్పంలో కూడా ఇంత దారుణంగా ఓడిపోవడం ఏమిటని టీడీపీ నాయకులు వాపోతున్నారు. పార్టీ ముఖ్య నాయకులు చాలామంది తమ నియోజకవర్గాల్లో రెండంకెల ఎంపీటీసీ స్థానాలను గెలిపించుకోలేక బోల్తాపడ్డారు. చంద్రబాబు పరిస్థితి వారి కంటే దీనంగా మారడం టీడీపీ క్యాడర్‌కు మింగుడు పడడంలేదు.  

Bala krishna Is far Baetter Than Chandrababu Over Muncipal Elections

టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజారపు అచ్చెన్నాయుడు తాను ప్రాతిని«థ్యం వహిస్తున్న చోట చంద్రబాబు కంటే కాస్త మెరుగ్గా నాలుగు ఎంపీటీసీలను గెలిపించుకున్నారు. ధూళిపాళ్ల నరేంద్ర, చింతమనేని ప్రభాకర్, నిమ్మల రామానాయుడు, బండారు సత్యనారాయణమూర్తి లాంటి నాయకులు రెండంకెల ఎంపీటీసీలను సాధించారు. జెడ్పీటీసీల్లోనూ చంద్రబాబు పార్టీ నాయకుల కంటే బాగా వెనుకబడిపోయారు. 

కుప్పంలో నాలుగింటిలో ఒక్క జెడ్పీటీసీని కూడా గెలిపించుకోలేకపోయారు. ఆరు జిల్లాల్లో ఒక్కో జెడ్పీటీసీని మాత్రమే టీడీపీ గెలవగా ఏడు జిల్లాల్లో అసలు ఖాతా తెరవలేదు. ఆ ఏడు జిల్లాల్లో చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరు ఉండడం తమకు తీవ్ర అవమానకరమని సీనియర్‌ నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. సీనియర్‌ నాయకుడు అయ్యన్నపాత్రుడు తన సొంత మండలం నర్సీపట్నంలో జెడ్పీటీసీని గెలిపించుకోగా చంద్రబాబు కుప్పంలో ఒక్క జెడ్పీటీసీని కూడా సాధించలేకపోయారు. ఈ క్రమంలో.. చంద్రబాబు సామర్థ్యంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. చంద్రబాబు సత్తా ఏపీలో తగ్గిపోతుందనే విమర్శలు ఎక్కువౌతున్నాయి. 

Follow Us:
Download App:
  • android
  • ios