Asianet News TeluguAsianet News Telugu

వచ్చేస్తోంది బజాజ్ ఎస్ఎస్ 160...

జులై చివరి వారంలోగా దేశవ్యాప్తంగా ఉన్న బజాజ్‌ షోరూమ్‌లలో పల్సర్‌ ఎన్‌ఎస్‌160 అమ్మకాలు ప్రారంభం కానున్నట్లు మార్కెట్‌ వర్గాలు పేర్కొన్నాయి. ఎక్స్ షోరూమ్‌లో దీని ధర కనిష్టంగా రూ.80వేల నుంచి గరిష్టంగా రూ.84 వేల వరకు ఉండనుంది. యమహా ఎఫ్‌జెడ్‌, సుజుకి గిక్సర్‌, అపాచీ పోటీ మోడళ్లకు ధీటుగా బజాజ్‌ ఎన్‌ఎస్‌ 160ని రూపొందించింది.

Bajaj pulsar ss 160 to hit the Indian roads soon

స్టైలిష్ బైకు ప్రేమికులను ఇంత కాలం ఊరిస్తున్న ‘బజాజ్ పల్సర్ ఎస్ఎస్ 160’ వచ్చే నెలలోనే మార్కెట్లోకి వచ్చేస్తోంది. షోరూముల్లో శాంపిల్స్‌  పెట్టినప్పటి నుండే చర్చనీయాంశమైన బైక్ ‘బజాజ్‌ పల్సర్‌ ఎన్‌ఎస్‌ 160’ చాలా కాలంగా వార్తల్లో నిలిచింది. ‘ఇండియాస్‌ మోస్ట్‌ అవేటెడ్‌ బైక్‌’ గా వార్తల్లో నిలిచింది. దేశీ కంపెనీ బజాజ్‌ రూపొందించిన ఎన్‌ఎస్‌ 160ని ఇప్పటికే టర్కీలో తర్వాత ఇండోనేసియా, మరికొన్ని ఆసియాదేశాల్లో విడుదల చేశారు. విడుదలైన ప్రతీచోటా  ఈ బైక్‌ సేల్స్ అదరగొట్టేసింది. అందుకనే ఆలస్యం చేయకుండా ఎన్‌ఎస్‌ 160ని జులైలోనే ఇండియలో విడుదల చేయాలని నిర్ణయించింది బజాజ్ యాజమాన్యం.

చూడటానికి ఎన్‌ఎస్‌ 160.. గతంలో వచ్చిన పల్సర్‌ ఏఎస్‌ 150 మోడల్‌ మాదిరే ఉన్నా హార్స్ పవర్‌ ఎక్కువ. స్టైలింగ్‌ విషయానికి వస్తే పల్సర్‌ ఎన్‌ఎస్‌ 200, 220 ఎఫ్‌లను పోలి ఉంటుంది. అయినాసరే ఆటోమొబైల్‌ నిపుణులు ఎన్‌ఎస్‌ 160కి భారీ రేటింగ్ ఇచ్చారు. ఎయిర్‌ ఆయిల్‌ కూల్డ్‌160.3 క్యూబిక్‌ కెపాసిటీ(సీసీ), 5స్పీడ్‌ గేర్‌ బాక్స్‌, 17పీఎస్‌, 13 ఎన్‌ఎంల సింగిల్‌ సిలిండర్‌ మోటర్‌, 17 ఇంచుల టైర్లు,  240ఎంఎం ఫ్రంట్‌ డిస్క్‌ బ్రేక్‌, 130 ఎంఎం రియర్‌ డ్రమ్‌ బ్రేక్‌ తదితర ఫీచర్లున్నాయి.


జులై చివరి వారంలోగా దేశవ్యాప్తంగా ఉన్న బజాజ్‌ షోరూమ్‌లలో పల్సర్‌ ఎన్‌ఎస్‌160 అమ్మకాలు ప్రారంభం కానున్నట్లు మార్కెట్‌ వర్గాలు పేర్కొన్నాయి.ఎక్స్ షోరూమ్‌లో దీని ధర కనిష్టంగా రూ.80వేల నుంచి గరిష్టంగా రూ.84 వేల వరకు ఉండనుంది. యమహా ఎఫ్‌జెడ్‌, సుజుకి గిక్సర్‌, అపాచీ పోటీ మోడళ్లకు ధీటుగా బజాజ్‌ ఎన్‌ఎస్‌ 160ని రూపొందించింది.

Follow Us:
Download App:
  • android
  • ios