Asianet News TeluguAsianet News Telugu

Badvel Bypoll: బద్వేల్ ప్రజలకు సీఎం జగన్ బహిరంగ లేఖ... తన ప్రచారంపై క్లారిటీ

బద్వేల్ ఉపఎన్నిక ప్రచారానికి రెండురోజులే సమయం మిగిలివుందనగా సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తన ప్రచారంపై క్లారిటీ ఇచ్చిన జగన్ ఓటర్లకు ఆత్మీయ బహిరంగ లేఖ రాసారు. 

Badvel Bypoll: AP CM YS jagan writes letter to badvel People
Author
Badvel, First Published Oct 26, 2021, 9:52 AM IST

కడప: బద్వేల్ నియోజకవర్గంలో తాను సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రచారంపై క్లారిటీ వచ్చింది. ప్రస్తుతం కోవిడ్ పరిస్థితులు, ఎన్నికల సంఘం నిబంధనల కారణంగా బద్వేల్ కు రాలేకపోతున్నానని స్వయంగా సీఎం జగనే ప్రకటించారు. ఈ క్రమంలోనే వైఎస్సార్ కాంగ్రెస్ ఫ్యాన్ గుర్తుకు ఓటేసి దివంగత ఎమ్మెల్యే వెంకటసుబ్బయ్య భార్య దాసరి సుధమ్మను భారీ మెజారిటీతో గెలిపించాలని cm ys jagan బద్వేల్ ప్రజలను కోరుతూ ఓ బహిరంగ లేఖ రాసారు.  

ఎన్నికల ప్రచారంలో పాల్గొని badvel నియోజకవర్గ ప్రజలతో గడపాలని... భారీ బహిరంగ సభ ద్వారా ఓట్లు అడగాలని భావించానని జగన్ పేర్కొన్నారు. కానీ కరోనా పరిస్థితుల దృష్ట్యా అలా చేయలేకపోతున్నానని... స్వయంగా మిమ్మల్ని కలిసి ఓట్లు అడగలేకపోతున్నానని పేర్కొన్నారు. తాను ఎన్నికల ప్రచారంలో పాల్గొంటే భారీగా జనాలు గుమిగూడటంతో corona వ్యాపించే ప్రమాదముంటుందన్నారు. తన ప్రచారం ఒక్కరు కూడా కోవిడ్ బారిన పడకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీఎం జగన్ తెలిపారు. 

బద్వేలు నియోజకవర్గంలోని అక్కాచెల్లెమ్మలకు, అన్నదమ్ములు, అవ్వాతాతలు పరిస్థితిని అర్థం చేసుకుంటారని భావిస్తున్నానన్నారు. తాను ప్రచారానికి రాకున్నా మీరు వైసిపి అభ్యర్థి Dasari Sudha, డాక్టరమ్మను ఆశీర్వదిస్తారని భావిస్తున్నానని... గతంలో వెంకటసుబ్బయ్యకి వచ్చిన మెజార్టీ కంటే ఎక్కువ మెజార్టీతో ఆయన భార్య సుధని గెలిపించాలని జగన్ కోరారు.  

read more  Badvel ByPoll: ఏపీకి తీరని ద్రోహం చేశాయి.. బీజేపీ, కాంగ్రెస్‌లపై మంత్రి పెద్దిరెడ్డి వ్యాఖ్యలు

అలాగే అధికారంలోకి వచ్చిన రెండున్నరేళ్లలో ysrcp government ఏమేం చేసిందో తన లేఖలో వివరించారు జగన్. వివిధ పథకాల ద్వారా ఎంతమంది లబ్దిదారులకు ఎలా ప్రయోజనం కలిగిందో తెలిపారు. రాష్ట్రంలోని రైతులకు, విద్యార్థులు, యువత, మహిళలు, వివిధ సామాజిక వర్గాలు, కులాలకు వైసిపి ప్రభుత్వం ఏమేం చేసిందో తన లేఖ ద్వారా బద్వేల్ ప్రజలకు తెలియజేసారు. తమ పాలనలో రాష్ట్ర అభివృద్ది, ప్రజా సంక్షేమాన్ని చూసి బద్వేల్ ప్రజలు నిర్ణయం తీసుకోవాలని సీఎం జగన్ సూచించారు. 

సీఎం జగన్ స్వయంగా ప్రచారానికి రాకున్నా ఆయన రాసిన లేఖను ప్రజల్లోకి తీసుకెళ్లాలని వైసిపి శ్రేణులు భావిస్తున్నాయి.  జగన్‌ రాసిన ఈ లేఖను ముద్రించి స్థానిక నేతలు ఇంటింటికీ వెళ్లి ఓటర్లకు పేరు   అందించి వైసిపిని గెలిపించాలని కోరుతున్నారు. 

వైసీపీ ఎమ్మెల్యే venkata subbaiah ఆకస్మిక మరణంతో బద్వేల్‌ ఉప ఎన్నిక అనివార్యమైన సంగతి తెలిసిందే. కోవిడ్‌తో వాయిదా పడిన ఎన్నికలను అక్టోబర్‌లో నిర్వహించేందుకు  election commission షెడ్యూలు విడుదల చేసింది. దివంగత ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్య సతీమణికే వైసీపీ టికెట్‌ ఇచ్చినందున  janasen పోటీ చేయడం లేదని ఇప్పటికే ఆ పార్టీ అధినేత  pawan kalyan ప్రకటించారు. పవన్ పోటీకి దూరమని ప్రకటించిన కొద్ది గంటల్లోనే టీడీపీ tdp సైతం విరమించుకుంటున్నట్లు వెల్లడించింది. గత సంప్రదాయాలను గౌరవిస్తూ తాము బద్వేల్ ఉపఎన్నిక బరి నుంచి తప్పుకుంటున్నట్లు తెలుగుదేశం పార్టీ ప్రకటించింది. 

అయితే బద్వేల్ ఉప ఎన్నికలో పోటీ చేయబోతున్నట్లు భారతీయ జనతా పార్టీ ప్రకటించింది. ఈ మేరకు పనతల సురేశ్‌ను అభ్యర్ధిగా వెల్లడించింది. మిత్రపక్షమైన జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటనకు భిన్నంగా ఏపీ bjp అధ్యక్షుడు సోము వీర్రాజు  సీరియస్ కామెంట్స్ చేశారు. బద్వేల్ ఉప ఎన్నికను బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుందని తెలిపారు. వైసీపీకి భయపడాల్సిన అవసరం లేదని బద్వేల్ ఎన్నికకు పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios