గంటా నాయకత్వం బాగా లేదు, చంద్రబాబు చురక

Babu unhappy over minister ganta in collectors conference
Highlights

గంటా మీద  ఇంత బహిరంగంగా  ముఖ్యమంత్రి ఇలా ‘ నాయకత్వం బాగ లేదు’ అని అనడం ఇదే ప్రథమం.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ రోజు రాష్ట్ర హెచ్ ఆర్ డి మంత్రి  గంటా మీద గరం గరమయ్యారు.

ఆయన నాయకత్వం బ ాగాలేదని అన్నారు. ఇది ఎక్కడో కాదు, ఏకంగా అంతా చూస్తుండగా... అంతా వింటుండగా, కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో. రెండు రోజులుగా వెలగపూడిలో కలెక్టర్ల కాన్షరెన్స్ నడుస్తూ ఉంది.  ఈ రోజు విద్య మీద సమీక్ష జరిగింది. అక్కడ గంటా  దొరికిపోయాడు.

విషయమేమింటే, విద్యా శాఖ వాళ్లు ఏర్పాటు చేసిన బయోమెట్రిక్ పరికరాలు పనిచేయడం లేదు. ఇది  ముఖ్యమంత్రి దృష్టి కి వచ్చింది. ఈ విధానం ఎందుకు అమలుకావడంలేదని ముఖ్యమంత్రి విద్యాశాఖాధికారులను అడిగారు. వారు చల్లగా  బయోమెట్రిక్ పరికరాలుసరిగ్గా పనిచేయడంలేదన్నారు. దీనితో ముఖ్యమంత్రి కి కోపం ససాలానికి అంటింది.

ప్రతి సంవత్సరం ఇదే సమాధానమేనా అని  మండిపడ్డారు. మూడేళ్లుగా ఇదే సమాధానమేనా అని ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

మరి పనికి  మాలిన పరికరాలను ఎందుకు కొన్నారని ప్రశ్నించారు. అపుడు విద్యాశాఖ మంత్రి  గంటా శ్రీనివాసరావు జోక్యంచేసుకుంటూ, విద్యాశాఖ వారు కొన్నవి బాగా పనిచేస్తున్నాయని, ఎపిటిఎస్ వారు సరఫరా చేసినవే పనిచేయడంలేదని గంటా చెప్పబోతున్నపుడు ముఖ్యమంత్రి అడ్డుకుని, ‘‘ మన నాయకత్వం బాగుంటే అన్నీ పనిచేస్తాయి,’ అని ఘాటయిన వ్యాఖ్య చేశారు.

అంతేకాదు, విద్యాశాఖ కు ఏటా అయిదువేల కోట్లిస్తున్నా  పనితీరు బాగా లేదని అన్నారు.

స్కూళ్లకు  ప్రహారీలు కట్టాలని రెండేళ్ల కిందట శంకు స్థాపన చేసినా ఇంకా పూర్తికాలేదని గంటాకు గుర్తు చేశారు.

గంటా మీద ఒపెన్ గా ముఖ్యమంత్రి ఇలా ‘ నాయకత్వం బాగ లేదు’ అని అనడం ఇదే ప్రథమం.

 

మరిన్ని వార్త ల కోసం క్లిక్ చేయండి 

 

loader